ఓం నమో వేంకటేశాయ!!

 

• ఈరోజు బుదవారం, 08.01.2020 ఉదయం 6 గంటల సమయానికి, తిరుమల: 13C°-24℃°

 

• నిన్న 90,578 మంది భక్తులకు కలియుగ దైవం శ్రీవేంకటేశ్వరస్వామి వారి దర్శన భాగ్యం తోపాటు వైకుంఠ ద్వార దర్శనం కూడా లభించింది.

 

• వైకుంఠ ఏకాదశి ద్వాదశి సందర్భంగా వైకుంఠద్వార దర్శనం చేసుకున్న 1,74,738 మంది భక్తులు.

 

• వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లో 03 కంపార్ట్మెంట్ లో సర్వదర్శనం కోసం భక్తులు వేచి ఉన్నారు.

 

 • ఈ సమయం శ్రీవారి సర్వదర్శనాని కి సుమారు 05 గంటలు పట్టవచ్చును.

 

• నిన్న 16,149 మంది భక్తులు స్వామి వారికి తలనీలాలు సమర్పించి  మొక్కులు తీర్చుకున్నారు.

 

• నిన్న స్వామివారికి హుండీ లో భక్తులు సమర్పించిన నగదు ₹: 3.19 కోట్లు.

 

• నిన్న 16,186 మంది భక్తులకు శ్రీ పద్మావతి అమ్మవారి దర్శన భాగ్యం కలిగినది.

 

• శీఘ్రసర్వదర్శనం(SSD), ప్రత్యేక దర్శనం (ఆన్ లైన్ ₹:300/-), దివ్యదర్శనం (కాలినడక) వారికి శ్రీవారి దర్శనానికి సుమారుగా రెండు గంటల సమయం పట్టవచ్చును.

 

గమనిక:

• ₹:10,000/- విరాళం ఇచ్చు శ్రీవారి భక్తునికి శ్రీవాణి ట్రస్ట్ ద్వారా ఒక విఐపి బ్రేక్ దర్శన భాగ్యం కల్పించిన టిటిడి.

 

ప్రత్యేక దర్శనాలు నిలుపుదల:

జనవరి 8 వరకు దివ్యదర్శనం టోకెన్లు, టైంస్లాట్‌ సర్వదర్శనం టోకెన్లు రద్దు.

 

జనవరి 8 వరకు తేదీ వరకు అంగప్రదక్షిణ
  టోకెన్లు రద్దు.

 

జనవరి 21, 28వ తేదీల్లో వృద్ధులు, దివ్యాంగులకు శ్రీవారి ప్రత్యేక దర్శనం.

 

జనవరి 22, 29వ తేదీల్లో 5 ఏళ్లలోపు చంటిపిల్లల దర్శనం.

 

తిరుప్పావై

 

ధనుర్మాసం కాలంలో తిరుమల శ్రీవారి ఆలయంలో సుప్రభాతానికి బదులుగా తిరుప్పావై పఠనం చేస్తారు. సహస్రనామార్చనలో తులసికి బదులు బిల్వపత్రాలతో పూజిస్తారు. ధనుర్మాసం ఉభయ సంధ్యల్లో ఇంటిని శుభ్రం చేసి దీపారాధన చేయడం వల్ల మహాలక్ష్మీ అనుగ్రహం లభిస్తుంది. దరిద్రం తొలగి అష్టఐశ్వర్యాలు సిద్ధిస్తాయి. విష్ణు ఆలయాల్లో ఉదయం అర్చన తర్వాత ప్రసాదాన్ని నివేదించి వాటిని పిల్లలకు పంచుతారు. దీన్నే బాలభోగం అంటారు. సూర్యుడు ధనస్సు నుంచి మకర రాశిలోకి ప్రవేశించే వరకు అంటే భోగి రోజు వరకూ ధనుర్మాసం కొనసాగుతుంది. ఈ నెల రోజులు విష్ణు ఆలయాల్లో పండుగ వాతావణం నెలకొంటుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: