ప్రపంచ వ్యాప్తంగా తెలుగు ప్రజలే కాదు యావత్ భారతీయులు ఎంతో గొప్పగా ఆరాదించే దైవాల్లో ఒకరు షిరిడీ సాయిబాబా.  ఈయన ఏదో ఒక యుగానికి చెందిన స్వామి కాదు.. మనుషుల మద్య ఉంటూ వారి కష్టాలను దూరం చేసి బాబా.  సామాన్యమైన వక్తిగా ఓ ఫకీరు గా అందరి ఇళ్ల వద్దకు వెళ్లి బిచ్చమెత్తుకొని తన కడుపు నింపుకునే వారు..అయితే ఆ బిక్ష కూడా ఓ యోగ సాదనే అంటారు.. పాపుల నుంచి బిక్ష రూపంలో తీసుకొని వాటిని ప్రక్షాళన చేసేవారని అంటారు.  సాయినాథుని లీలలు ఎన్నో ఉన్నాయి. ఎంతో మందికి ఆయన భోదనల ద్వారా చైతన్యం తీసకువచ్చారు.  భగవంతుడు అంతటా, అందరిలోనూ ఉన్నాడనేది బాబా బోధనలలో ఒక ముఖ్యాంశం. సాయిబాబా ఉపదేశాలు ఇస్లామిక్ సిద్ధాంతాలకూ, ఉపనిషత్సూత్రాలకూ కూడా సరిపోతాయి. ఈ లోకం నశ్వరమనీ, భగవంతుడిచ్చే మోక్షమే శాశ్వతమనీ చెప్పారు.

 

సాధనలో గురువు ప్రాముఖ్యతను గురించీ, గురువునే దేవుడిగా భావించమనీ పదేపదే చెప్పారు. పూర్వపు కర్మల కారణంగా వివిధ ఫలితాలు సంభవిస్తాయని కూడా చెప్పారు. తన వద్దకు దర్శనానికి వచ్చిన వారిని తరచు సాయిబాబా ‘దక్షిణ’ అడుగుతుండేవాడు. అలా వచ్చిన ధనాన్ని పేదలకు పంచిపెట్టేవారు. మిగిలిన కొద్దిపాటి ధనంతో పుగాకు, అగ్గిపెట్టెలవంటివి కొనేవారు. భక్తులవద్ద దక్షిణ తీసికొని వారి పూర్వ ఋణాలను చెల్లించడానికి దోహదం చేస్తారని అతని అనుయాయులు అనేవారు. రెండు మతాల గ్రంథాలనూ సాయిబాబా ఆదరించి వ్యాఖ్యానించారు. వాటిపై ఆయనకు లోతైన పరిజ్ఞానం ఉంది.

 

హిందూ మత విషయాలపై బాబా వ్యాఖ్యానాలలో అద్వైతం, భక్తి అంశాలు కలగలిసి ఉండేవి. తన నివాస స్థానమైన మసీదుకు ద్వారకామాయి అని పేరు పెట్టుకున్నారు.  సాయిబాబా తన మార్గానికి, ఉపదేశాలకు చెందిన సంస్థాగత ఏర్పాట్లు ఏవీ చెయ్యలేదు. ప్రత్యేకించి తన శిష్యులు అని చెప్పుకొనే వ్యవస్థ కూడా ఏమీ లేదు. ఆయన అందరికీ చెందినవారు. సకోరీకి చెందిన ఉపాసనీ మహారాజ్ , అహమ్మద్ నగర్‌కు చెందిన మెహర్ బాబా వంటి సాయిబాబా భక్తులు ప్రసిద్ధులయ్యారు.  వీరి ద్వారా దేశ వ్యాప్తంగా బోధనలు చేస్తూ సాయినాథుని లీలలు చాటి చెప్పారు. 
 

 

 

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: