మకర సంక్రాంతి.. ఈ సంక్రాంతి పండుగను తెలుగు రాష్ట్రాల ప్రజలు ఎంతో సంబరంగా జరుపుకుంటారు. పిల్లలు గాలి పాఠాలు ఎగరేస్తూ.. ఇంట్లో అమ్మ వాళ్ళు అమ్మమ్మ వాళ్ళు పిండి వంటలు చేస్తూ.. బయట ఆడపిల్లలు రంగు రంగు ముగ్గులు వేస్తే సంక్రాంతి పండుగను ఎంతో ఆనందంగా చేసుకుంటారు. 

 

అందుకే సంక్రాంతి పండుగా కోసం ప్ర‌తి ఒక్క‌రు కొత్త బ‌ట్టలు కొనుక్కుంటారు. సంక్రాంతి పండుగాకు ఇంకా 10 రోజులకు ఉంది అనగానే సంక్రాంతి పండుగ కోసం కొత్త బట్టలను కొంటారు. అయితే సంక్రాంతి అంటేనే పెద్ద‌ల పండ‌గ‌. కొత్త బ‌ట్ట‌లు, కొత్త ధాన్యం.. పంట‌ల‌ను గతించిన పెద్ద‌ల చిత్ర‌ప‌టాల ముందు ఉంచి వారికి స‌మ‌ర్పించి, వారి జ్క్షాప‌కాల‌ను క‌నీసం ఓ నిముషం పాటు స్మ‌రించుకునే పండుగ కానీ, నేటి యువ‌త‌కు ఇవ‌న్నీ తెలుసా?  చెప్పేవారేరీ?

 

ఇవి అన్ని చెప్పే వారే కరువైపోయారు.. ఒకవేళ చెప్పేవాళ్ళు ఉన్న పట్టించుకునే వాళ్ళు ఒకరు కూడా లేరు. సంక్రాంతి అయినా మరి ఇంకే పండుగా అయినా మేము ఇలాగే చూసుకుంటాం అని కొందరు బెదిరిస్తే.. మరి కొందరు పండుగా సమయాల్లో కూడా ఉద్యోగాలకు వెళ్ళిపోతారు.. అసలు ఈ పండుగను పెద్దల పండుగా అనుకొనే అనుకోరు. 

 

అయినా మన పిచ్చి కానీ.. బతికి ఉన్నవారితో గడిపే సమయమే ఈతరం వారికీ లేదు.. అలాంటిది గోడెక్కిన ఫోటోల కోసం వీళ్లకు సమయం ఉంటుందా ? ఏం మాట్లాడుతున్నారు మీరు ? అని ఈతరం అంటుంది. అందుకే సంక్రాంతి పండుగా తీరు.. ఆల్మోస్ట్ చాలా మారిపోయింది. మరి కొన్ని సంవత్సరాల్లో ఈ మాత్రం సంక్రాంతి కూడా ఉండదు అనుకోండి. 

మరింత సమాచారం తెలుసుకోండి: