సంవత్సరం నుండి వెయిట్ చేస్తున్న సంక్రాంతి పండుగా వచ్చేసింది. సంక్రాంతి అల్లుళ్లు.. కూతుర్లు సంబరాలు ఇంట్లో వచ్చి సంబరాలు చేసుకుంటున్నారు. అయితే సంక్రాంతి పండుగా గురించి మనం ఇప్పటికే తెలుసుకున్నాం. సంక్రాంతి పండుగ ముందు రోజు వచ్చే బోగి గురించి తెలుసుకుందాం..
సంక్రాంతి ముందు వచ్చే పండుగను మనం బోగి అని పిలుస్తాం. అయితే ఈ పండుగకు బోగి పండుగా అనే కాదట.. మరో పేరు కూడా ఉందట.. మూడు రోజుల సంక్రాంతి పండుగలో తొలి రోజును భోగిగా పేర్కొని చేసుకుంటున్నారు. అయితే, భోగి ఎవరి పండుగ అని శాస్త్రాలను పరిశీలిస్తే.. లక్ష్మీదేవి పండుగగా చెప్పారు. అలక్ష్మిని పోగొట్టి.. లక్ష్మిని స్వాగతించే పండుగగా పురాణాలు సైతం పేర్కొన్నాయి. అలక్ష్మిని పోగొట్టుకోవడం అంటే.. భోగిమంటలను వేయడం.
ఇళ్లలోని పాత వస్తువులను తీసుకువచ్చి కుప్పగావేసి.. మంటను ఏర్పాటు చేయడం ద్వారా అలక్ష్మిని కాల్చివేస్తారు. ఇక, ఈ మంటలో పొంగి పొర్లే నీటిలో కొద్దిగా గంధం కానీ, పసుపు కానీ కలిపి స్నానం చేయడం ద్వారా స్వాగతం పలకడం అనేది శాస్త్రీయంగా చెప్పబడిన అంశం. ఇదేనండి బోగి పండుగ అసలు సిసలైన పేరు.