
సంక్రాంతి తెలుగింట పెద్ద పండుగ. ఈ పండుగ కోసం ఎన్నో పిండివంటలు చేసుకుంటారు. అయితే ఎన్ని పిండి వంటలు వండుకున్నా.. సంక్రాంతి కోసం కొన్ని ప్రత్యేకమైన భక్తి వంటకాలు ఉన్నాయి. అవేంటంటే..
భోగినాడు పులగం అంటే.. పెసరపప్పుతో కూడిన అన్నం చేసుకోవడం ఎంత ఆనవాయితీనో.. సంక్రాంతి నాడు ఉత్తరాయణం ప్రారంభం అవుతున్న నేపథ్యంలో బెల్లంతో కూడిన పరమాన్నం చేసుకోవడం అంతే ఆనవాయితీ. నేటి రోజుల్లో చాలా మంది ``పరవాణ్ణం``- అనే పదం వాడుతున్నారు.
అయితే అసలు పదం అది కాదు.. దీని పేరు పరమాన్నం.. అంటే.. పరమ+అన్నం అన్నమాట. అంటే.. పరమ అంటే.. పూజనీయమైన అన్నం.. ఆహారం.. మరి ఇది ఎందుకు అంత పూజనీయం అయ్యింది.. ఎందుకు దీనికి అంత ప్రత్యేకత.
అంటే.. ఇది పూజనీయమైన ఆహారం ఎందుకంటే.. ఉత్తరాయణ పుణ్య కాలంలో విష్ణు మూర్తికి ప్రసాదంగా సమర్పించేది కదా.. అందుకే ఇది పూజనీయమైన ఆహారం.. అందుకే.. సంక్రాంతికి ఎన్ని పిండి వంటలు ఎన్ని రకాల పదార్థాలు చేసుకున్నా.. ఎన్ని వెరైటీలు వండుకున్నా.. పరమాన్నం తప్పక చేసుకుని... ప్రసాదంగా ఇంటిల్లిపాదీ తీసుకోవాలి.