హైదరాబాద్.. విభిన్న సంస్కృతుల మేలు కలయిక.. అన్ని వర్గాలు మత సామరస్యంతో జీవించే నగరం.. ఈ నగరంలోని జల్ పల్లి మున్సిపాలిటీలోని పహాడీషరీఫ్ కొండ ఉంటుంది. ఇక్కడి బాబా షర్ఫుద్దీన్ దర్గాకు చాలా ప్రత్యేకత ఉంది.

 

ఇక్కడి దర్గాలో ఏటా మూడు రోజులు ఉర్సు ఘనంగా జరుగుతుంది. కులమతాలకతీతంగా వేల సంఖ్యలో భక్తులు తరలివస్తారు. ప్రత్యేక ప్రార్థనలు, పూజలు చేస్తారు. మరి ఇంతకీ ఈ దర్గా వెనుక ఉన్న కథమేమిటి..? తెలుసుకుందాం..

 

ఇరాక్ లో జన్మించిన బాబా షర్ఫుద్దీన్ 759 ఏళ్ల కిందట తన 17వ ఏట మత ప్రచారానికని హైదరాబాద్ వచ్చారు. నేటి బాలాపూర్.. నాటి బాబాపూర్‌లో స్థిరనివాసం ఏర్పరుచుకున్నారు. ఆయన నివాసం నేటికీ చెక్కు చెదరకుండా ఉంది. అప్పట్లో ఆయ

నకు తోడు ఓ పెద్దపులి ఉండేది. దాంతో కలిసి రోజూ నిత్యం ఆయన స్థానిక కొండపైకి భక్తులతో కలిసి వెళ్లేవారు.

 

మనుషులంతా ఒక్కటేనని చాటి చెప్పారు. వందేళ్ల ప్రాయంలో కొండపై మరణించారు. ఆ స్థలంలోనే ఆయన్ను సమాధి చేశారు. ఆయన పేరు మీదుగానే ఆ ప్రాంతానికి పహాడీ షరీఫ్ అని పేరు వచ్చింది. పహాడీ షరీఫ్ అంటే.. మానవతా మూర్తి నిద్రించి

ఉన్న కొండ అని అర్థం.

మరింత సమాచారం తెలుసుకోండి: