మేడారం.. తెలంగాణలోనే ఆ మాట కొస్తే దక్షిణ భారతంలోనే అతి పెద్ద గిరిజన జాతర. ఈ జాతరకు అప్పుడే రద్దీ మొదలైంది. హైదరాబాద్ నుంచి మేడారం జాతరకు వెళ్లాలనుకుంటున్న వారికి శుభవార్త. ఆర్టీసీ మేడారం కోసం ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేస్తోంది. అంతే కాదు.. వీటిని ప్రయాణికులకు అందుబాటులో ఉంచుతోంది.
మేడారం సమ్మక్క, సారలమ్మ జాతరకు వెళ్లే భక్తుల కోసం ఆర్టీసీ ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేసినట్లు రంగారెడ్డి రీజియన్ రీజినల్ మేనేజరు తెలిపారు.జాతర సందర్భంగా ముందెన్నడూ లేని విధంగా 500 ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. వీటికి 50 శాతం అదనపు ఛార్జీలు చెల్లించాల్సి ఉంటుందని చెప్పారు.
ఫిబ్రవరి 2వ తేదీ నుంచి 9వ తేదీ వరకు ఎంజీబీఎస్, జేబీఎస్, దిల్ సుఖ్ నగర్, నేరెడ్ మెట్, లింగంపల్లి, కేపీ హెచ్ బీ, మియాపూర్, ఉప్పల్, లాల్‌దర్వాజ తదితర ప్రాంతాల నుంచి బస్సులు నడుపుతారు. ఎంజీబీఎస్, జేబీఎతో పాటు ఆర్టీసీ అధీకృత ఏజెంట్ల వద్ద ముందస్తు బుకింగ్ సౌలభ్యం కల్పించారు.