ఓం నమో వేంకటేశాయ!!
• ఈరోజు సోమవారం,27.01.2020 ఉదయం 6 గంటల సమయానికి,తిరుమల: 16C°-28C°.
• నిన్న 78,180 మంది భక్తులకు కలియుగ దైవం శ్రీవేంకటేశ్వరస్వామి వారి దర్శన భాగ్యం లభించింది.
• వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లో 01 కంపార్ట్మెంట్ లో సర్వదర్శనం కోసం భక్తులు వేచి ఉన్నారు.
• ఈ సమయం శ్రీవారి సర్వదర్శనాని కి సుమారు 04 గంటలు పట్టవచ్చును.
• నిన్న స్వామివారికి హుండీ లో భక్తులు సమర్పించిన నగదు ₹: 4 కోట్లు.
• నిన్న 18,950 మంది భక్తులకు శ్రీ పద్మావతి అమ్మవారి దర్శన భాగ్యం కలిగినది.
• శీఘ్రసర్వదర్శనం(SSD),ప్రత్యేక దర్శనం (ఆన్ లైన్ ₹:300/-), దివ్యదర్శనం (కాలినడక) వారికి శ్రీవారి దర్శనానికి సుమారుగా రెండు గంటల సమయం పట్టవచ్చును.
గమనిక:
• ₹:10,000/- విరాళం ఇచ్చు శ్రీవారి భక్తునికి శ్రీవాణి ట్రస్ట్ ద్వారా ఒక విఐపి బ్రేక్ దర్శన భాగ్యం కల్పించిన టిటిడి.
ప్రత్యేక దర్శనాలు:
• జనవరి 28న వృద్ధులు,దివ్యాంగులకు శ్రీవారి ప్రత్యేక దర్శనం.
• జనవరి 29న 5 ఏళ్లలోపు చిన్నపిల్లల తల్లిదండ్రులకు ప్రత్యేక దర్శనం.
శ్రీవేంకటేశ్వర సుప్రభాతం
కౌసల్యా సుప్రజా రామ పూర్వా సంధ్యా ప్రవర్తతే, ఉత్తిష్ఠ నరశార్దూల కర్తవ్యం దైవమాహ్నికమ్.
తా: కౌసల్యాదేవికి సుపుత్రుడవగు ఓ రామా! పురుషోత్తమా తూర్పు తెల్లవారుచున్నది. దైవ సంబంధములైన ఆహ్నికములను చేయవలసియున్నది కావున లెమ్ము స్వామి.