పంచ కేదారాలు గురించి తెలియని నిజాలు ఇప్పుడే తెలుకోండి?
 
శివుడి మహత్యం ఎంతో. శివుడి మహిమ నిజంగా ఎంతో గొప్పది. శివ నామం ఎంతో పవిత్రం. శివ పూజ ఎంతో పుణ్యం. కారీక మాసం లో శివుడిని భక్తులు ఎంతో భక్తి తో పూజిస్తారు. అయితే శివ రాత్రి గొప్ప పర్వదినం అనే చెప్పాలి. శివ రాత్రి రోజున జాగారం చెయ్యడం దేవాలయాలన్నీ పూజల తో దీపాల తో అలంకరించడం. భక్తులు ఉపవాసం ఉండడం ఇదంతా తెలిసినదే
 
 
అయితే తెలియనివి ఎన్నో ఉంటాయి. అన్నీ ఎవరికీ తెలియవు. అసలు శివుడు ఎందుకు ఐదు చోట్ల లో ఉన్నాడు? వీటిని పంచ కేదారాలు అని ఎందుకు అంటారు? అక్కడి శివుడి కి ఎందుకు అంత ప్రత్యేకత? వీటి అన్నింటినీ తెలుసు కోవాలి అంటే ఆలస్యం ఎందుకు? చదివేయండి
 
 
పాండవులు యుద్ధం అనంతరం పాపాలు పోగొట్టు కోవడానికి శివ దర్శనం కోసం కాశి వెళ్ళారు. దర్శన భాగ్యం ఇవ్వడానికి శివుడి కి ఏమాత్రం ఇష్టం లేదు. అందుకే వారు వచ్చిన తక్షణమే మాయం అయ్యి పోయాడు. కానీ పాండవులు వూరుకుంటారా? లేదే. అందుకే శివుడి వెంట వెళ్ళారు. శివుడు అక్కడ నుండి మాయమై పోయాడు. అప్పుడు శివుడి శరీర భాగాలు ఐదు చోట్ల పడ్డాయి. ఆ ఐదే మహా దేవాలయాలు అయ్యాయి. పంచ కేదారాలు గా పిలువ బడుతున్నాయి.
 
 
కేదారినాధ్, తుంగ నాధ్, రుద్ర నాధ్, మధ్య మహేశ్వర్, కల్పేశ్వర్ ఇవే మన పంచ కేదారాలు. మొదటిది కేదారినాధ్ ఇక్కడే ఆది శంకరాచార్యులు మోక్షం పొందారు. రెండవది తుంగ నాధ్ అర్జుడు ఈ క్షేత్రాన్ని నిర్మించాడట. మూడవది రుద్ర నాధ్ ఈ ఆలయానికి వెనుక భాగం లో వైతరిణి నది ప్రవహిస్తుంది. నాల్గవది మధ్య మహేశ్వర్ విశ్వనాధుని నాభి మహా లింగంగా అయ్యిందట. ఐదవది కల్పేశ్వర్ గుహ లో వెలిసాడు ఈ శివుడు.
 
 
 
 
 

మరింత సమాచారం తెలుసుకోండి: