ఒక నమ్మకం ప్రకారం పరమశివుడు ఉత్తరా నక్షత్రాణ ఒక రాత్రి ఈ భూమిపై అవతరించారని శివ పురాణంలో చెప్పబడింది. జ్యోతిర్లింగమంటే శివుడు కొలువై ఉన్న దివ్యక్షేత్రం. జ్యోతిర్లింగాలు మొత్తం 64 ఉన్నప్పటికి వాటిలో 12 మాత్రమే ప్రాముఖ్యతను సంతరించుకున్నవి. మొదటిది గుజరాత్లోని శ్రీ సోమనాథ్ జ్యోతిర్లింగ దివ్యక్షేత్రం, గుజరాత్ రాష్ట్రంలోని ప్రభాస్ పఠాన్ గ్రామం వద్ద సోమనాథ్ క్షేత్రం ఉన్నది. శివ భక్తులు విరివిగా దర్శించే ఈ సోమనాథ్ క్షేత్రం ఎంతో ప్రాముఖ్యతను సంతరించుకున్నది. ఈ సోమనాధ జ్యోతిర్లింగక్షేత్రం తొలి తీర్దయాత్ర కేంద్రంగా ప్రసిద్దిచెందింది. రెండవ జ్యోతిర్లింగం శ్రీ మల్లికార్జున జ్యోత్రిలింగ దివ్యక్షేత్రం ఆంధ్రప్రదేశ్. కృష్ణా నది ఒడ్డున శ్రీ శైల పర్వతం మీద ఉంది. దీనిని "దక్షిణ కైలాశం” అని కూడా పిలుస్తారు.
శ్రీమల్లిఖార్జున జ్యోతిర్లింగ క్షేత్రంలో పరమశివుడు “శ్రీ మల్లిఖార్జునుడు” గా మరియు పార్వతి “భ్రమరాంబిక”గా కొలువై ఉన్నారు. మూడవది శ్రీ మహాకాళేశ్వర జ్యోతిర్లింగ దివ్యక్షేత్రం మధ్యప్రదేశ్. ఉజ్జయినీలోని దట్టమైన మహాకాల్ అడవిలో క్షిప్రా నది ఒడ్డున ఉంది. మధ్యప్రదేశ్ లోని ఈ జ్యోతిర్లింగం మధ్య భారతదేశంలో ఒక ముఖ్యమైన పుణ్య క్షేత్రం. ఈ జ్యోతిర్లింగం ఎలా ఉనికిలోకి వచ్చింది అనేదానికి సంబంధించిన అనేక కథలు పురాణముల్లో చెప్పబడి ఉన్నాయి. నాల్గవది శ్రీ ఓంకారేశ్వర జ్యోతిర్లింగ దివ్యక్షేత్రం. అత్యంత ప్రముఖమైన జ్యోతిర్లింగాలలో ఒకటి జ్యోతిర్లింగం మధ్యప్రదేశ్ లోని నర్మదా నదిలో శివపురి అనే ద్వీపంలో ఉంది.
ఐదవది శ్రీ వైద్యానాథ; శ్రీ వైజ్నాథ్; శ్రీ బైద్యానాథ్ జ్యోతిర్లింగ దివ్యక్షేత్రం. ఈ వైద్యనాధ జ్యోతిలింగ దేవాలయం ఝార్ఖండ్లోని శాంటల్ పరగణాలలో దెగఢ్ ప్రాంతంలో వద్ద ఉంది. ఇది అత్యంత గౌరవింపబడిన జ్యోతిర్లింగ పుణ్యక్షేత్రాలలో ఒకటి. ఆరవది శ్రీ భీమశంకర జ్యోతిర్లింగ దివ్యక్షేత్రం మహారాష్ట్ర పూణే. పూణే లోని సహ్యాద్రి ప్రాంతంలో ఉంది. ఇది భీమ నది ఒడ్డున కలదు. ఇది ఈ నదికి మూలం. ఏడవది శ్రీ రామేశ్వర జ్యోతిర్లింగ దివ్యక్షేత్రం. తమిళనాడు లోని సేతు తీరంలో రామేశ్వరం ద్వీపంలో ఉన్న ఈ జ్యోతిర్లింగ దివ్యక్షేత్రం 12 జ్యోతిర్లింగాలకు దక్షిణ భాగం. ఎనిమిదవది శ్రీ నగనాథ లేదా శ్రీ నాగేశ్వర జ్యోతిర్లింగ దివ్యక్షేత్రం. నాగేశ్వర జ్యోతిర్లింగ దివ్యక్షేత్రం గోమతి ద్వారకా మరియు గుజరాత్ లోని సౌరాష్ట్ర తీరంలోని బైట్ ద్వారకా ద్వీపం మధ్య మార్గంలో ఉంది. తొమ్మిదవది శ్రీ కాశీ విశ్వనాధ్ జ్యోతిర్లింగ దివ్యక్షేత్రం.
పదవది శ్రీ త్రయంబకేశ్వర్ జ్యోతిర్లింగ దివ్యక్షేత్రం, నాసిక్. మహారాష్ట్రలోని నాసిక్ నుండి 30 కి.మీ.ల దూరంలో గోదావరి నది పరీవాహక ప్రాంతములో ఉండే బ్రహ్మగిరి అనే పర్వతం వద్ద ఉంది. పదకొండవది శ్రీ కేదార్నాధ్ జ్యోతిర్లింగ దివ్యక్షేత్రం కేదార్నాధ్. భారతదేశంలోని అతి పవిత్రమైన యాత్రా స్థలాలలో ప్రముఖమైనది శ్రీ కేదార్నాథ్ దేవాలయం. పన్నెండవది శ్రీ ఘృశ్నేశ్వర్ జ్యోతిర్లింగ దివ్య క్షేత్రం ఔరంగాబాద్. మహారాష్ట్రలోని ఔరంగాబాద్ సమీపంలోని దౌలాతబాద్ నుండి 20 కిలోమీటర్ల దూరంలో ఉన్న వేరుల్ అనే గ్రామంలో శ్రీ ఘృనేశ్వరజ్యోతిర్లింగ ఉంది. అజంతా & ఎల్లోరా గుహలు ఈ ఆలయ సమీపంలో ఉన్న ప్రసిద్ధ పర్యాటక ప్రదేశం.