
ఈ బుర్ఖా అనే సంస్కృతిని మనం పెట్టుకున్నది కాదు. అల్లా ఆడవారికి పరదాను నియమించాడు. ఇస్లామిక్‌లో దీనికి ఒక సైంటిఫిక్ రీజన్ ఉంది. ఒక ఇల్లు కడితే దానికి మాషా అల్లా అని పెడతాం. అంటే అర్ధం దీన్నిదేవుడు ఎలా కోరుకుంటే ఇది అలా తయారయిందని ఓ లెక్క. ఎవరి సాంప్రదాయాన్ని వాళ్ళు పాటిస్తారు. హిందువులు ఇంటికి గుమ్మడికాయ, పటిక కడతారు. ఇలా ఎవరి సాంప్రదాయాన్ని వాళ్ళు పాటిస్తుంటారు. అయితే ఎందుకు కడతారు గుమ్మడికాయ, పటిక, మాషాఅల్లా ఎందుకు కట్టావంటే.... మనిషి చూపులో అంత చెడ్డ ఉంది కాబట్టి. వాళ్ళు చూసిన ఆ చెడ్డ చూపు వలన ఆ ఇంటికి ఎటువంటి అశుభం జరగకూడదని వాళ్ళ చెడు చూపు ఇంటి పై పడకూడదు అని కడుతుంటాం. ఇంటికి ఇవన్నీ కడుతున్నాం కదా. మరి యవ్వనంలో ఉన్న భార్య, చెల్లి, తల్లి ఇలా ఎవరైనా సరే శుభ్రంగా తయారయి వెళుతుంటే ఎవరు ఎటువంటి చూపుతో చూస్తారో తెలియదు కాబట్టి ముసుగు వేసి తీసుకువెళితే వెళ్లేది ముసలివాళ్ళ, లేక వయసులో ఉన్నవాళ్ళ అన్న విషయం అర్ధం కాదని కేవలం ముస్లింలు వెళుతున్నారు. ముసుగు వేసుకుని అని అనుంటారు అంటారు అని దైవప్రవక్తలు చెప్పేవారు. ఆ భావన కలగాలని ఈ బుర్ఖాని పెట్టారు. చెడు ఉద్దేశంతో ఆడవారిని చూడకూడదని ఆ దైవం ఈ పరదాని పెట్టారు.
ఇక దీనికి కొంత మంది వితండ వాదులు మనసుబావుండాలిగాని పరదా వేస్తే అయిందేంటి అని అనేవాళ్ళుకూడా ఉంటారు. మరి అలాంటప్పుడు కడుపు నిండాలంటే భోజనం చెయ్యడం ఎందుకు మనసులో ఉంటే చాలు కదా అని కొందరు వాదిస్తున్నారు. అది మనసులో ఉంటే కాదు ఆచరణలో పెడితేనే మనసుకి వస్తది. కాబట్టి ఆడవారు తలపై ఎప్పుడూ ముసుగువేసుకుని ఉండాలి. ఇంటి నుండి అడుగు బయట పెట్టేటప్పుడు తలపైన పరదా వేసుకుని వెళ్ళాలి. ఎప్పుడూ ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి. ఒక ఆడది ఎప్పుడైతే ఇంటి నుంచి బయలు దేరుతుందో ఆమె వెనకాలే ఒక సైతాన్ కూడా బయలు దేరుతుంది. పరాయి మగవాడి చూపు ఆడదాన్ని ఆకర్షింపచేస్తాడు. అది ఎంత కఠినంగా ఉన్నప్పటికీ పాపం చెయ్యడానికి ఒడిగట్టిస్తాడు అంటారు. అదే పరదా వేసుకుంటే బంద్. దారి మూసేశాం.
ఏమీ కనపడటం లేదు. కళ్ళు ఉన్నాయి చూశారా అవి సైతాన్ దగ్గర 72 వేల దారులు ఉన్నాయట ఒక మనిషిని చెడగొట్టడానికి అందులని మొదటిదారి కంటిచూపు. ఒక్కో కంటిలో పాతికవేల కెమెరాలుంటాయట. సైంటిస్ట్‌లు, డాక్టర్లను కనుక్కోండి ఒక్కో కంటిలో పాతికవేలకెమెరాల కుండేంత ఫోకస్ ఒక్కో కంటికి ఉంటుందట. ఆ మనసులోకి చెడు అనేది రాకూడదని ఆడవారిని పరదా వాడమని నిర్ధేశించారు. నల్లటి ముసుగు వేసుకోవడం వల్ల ఎదుటివారి కంట్లో పడమని అలా నిర్ణయించింది ఇస్లాం ధర్మం. కానీ దీనికి కొంత మంది ముస్లిం ఆడవారే మేం అలకరించుకున్నది కనిపించవద్దా అని ఫీలవుతూ ఉంటారు. అయితే ఆడవారు ఆడవారు ఉండగా ఓకే . కానీ వేరే మగవారు ఉన్నప్పుడు మాత్రం ఖచ్చితంగా పరదా పాటించాలని రూల్ ఉంది. ఇక ఇలాంటివి ఇస్లాం ధర్మంలో ఎన్నో ఉన్నాయి అలాంటివి పాటించాలి అని పూర్వికులు చెబుతున్నారు.