అయ్యప్పస్వామిని దర్శించుకునేందుకు ప్ర‌తి ఏటా లక్షలాది మంది శబరిమలకు వ‌స్తుంటారు. స్వామియే శరణం అయ్యప్ప అంటూ... స్వామిని కళ్లారా చూసేందుకు పోటీ ప‌డుతుంటారు భ‌క్తులు. సోపానం దగ్గర ఫ్లైఓవర్, పవిత్ర మెట్లు, దిగువ తిరుముత్తం, వలియానదపండల్ ఇలా ఎక్కడ చూసినా భక్తులే నిండిపోయి కనిపిస్తున్నారు. తిరుపతి లడ్డూకు ఎంతటి ప్రాధాన్యత ఉందో.. అయ్యప్పస్వామి ప్రసాదానికి కూడా అంతే ప్రాముఖ్యత ఉంది. స్వామివారి ప్రసాదాన్ని అరవణ పాయసం అంటారు. 

 

స్వామి దర్శనానికి వచ్చే భక్తులు యాత్ర ముగించుకుని వచ్చేటప్పుడు స్వామివారి ప్రసాదాలు అరవణ పాయసం, అప్పం తప్పకుండా తీసుకుంటారు. చలికాలంలో అయ్య‌ప్ప‌ ప్రసాదం తిన‌డం వ‌ల్ల‌ శరీరంలో వేడిని కలిగిస్తుంది.  బియ్యం, నెయ్యి, బెల్లం కలిపి అరవణ పాయసం తయారు చేస్తారు. బియ్యం, నెయ్యి, బెల్లాన్ని ఉపయోగించి ఈ ప్రసాదంలో అనేక పోషక పదార్ధాలు మిలితం అయిన ఉంటాయి కాబట్టి ఆరోగ్యానికి ఈ ప్ర‌సాదం ఎంతో మేలు చేస్తుంది.

 

ఇక ఏటా రెండు నెలల వ్యవధిలో సుమారుగా 80 లక్షల ప్రసాదం డబ్బాలను దేవస్థానం బోర్డు విక్రయిస్తుంది. ఒక్కో డబ్బా 250 గ్రాముల బరువు ఉంటుంది. అంతేకాదు, ఈ ప్రసాదానికి వాడే బియ్యం మావెలిక్కరలోని ట్రావెన్‌కోర్‌ దేవస్థానం బోర్డు పరిధిలోని చెట్టికులంగర దేవి ఆలయం నుంచి సరఫరా అవుతాయి. అయితే ప్ర‌తి ఏటా ప్రసాదం కౌంటర్ల దగ్గర కూడా చాలా రష్ ఉంటుంది. దిగువ తిరుముత్తం, మల్లిక్కప్పురం దగ్గర అరవణ, అప్పం ప్రసాదం కొనేందుకు భక్తులు తెగ పోటీపడుతున్నారు.  

మరింత సమాచారం తెలుసుకోండి: