
కరోనా వైరస్ పుణ్యమా అని ఒక పండగ లేదు పబ్బం లేదు. మన కర్మ కాకపోతే ఇది ఏంటి? దేశం అంత చిగురుటాకులా వణికిపోతుంది.. ప్రజలందరినీ ఇళ్లకే పరిమితం చేసింది. ఇంకా ఉగాది పండుగ ఏమో రేపే.. అందరూ ఇంట్లోనే ఉంటారు కాబట్టి ఉగాది నాడు మంచి మంచి వంటకాలతో సందడి చేద్దాం.. ఉగాది పండుగను ఘనంగా జరుపుకుందాం. ఇంకా ఈ ఉగాది పచ్చడి ఎలా తయారు చెయ్యాలి అనేది ఇక్కడ చదివి తెలుసుకోండి.
కావాల్సిన పదార్దాలు..
మామిడికాయ - 1
వేప పువ్వు- 1/2 కప్పు
కొబ్బరి ముక్కలు- 1/2 కప్పు
కొత్త చింతపండు- 100 గ్రాములు
కొత్త బెల్లం- 100 గ్రాములు
మిరపకాయలు- 2
అరటిపండు - 1
చెరకు రసం -1/2 కప్పు
ఉప్పు - సరిపడేంత
నీళ్లు..
తయారీ విధానం..
ముందుగా చింతపండు కొన్ని నీళ్లలో నానబెట్టి పది నిమిషాల తర్వాత దాన్ని గుజ్జు చెయ్యాలి.. మామిడికాయ.. మిరపకాయలు, కొబ్బిరి అన్ని చిన్నగా కట్ చేసుకొని పెట్టుకోవాలి.. ఆతర్వాత వేప పువ్వును వేరు చేసి పెట్టాలి. తర్వాత చెరుకు రసం సిద్ధం చేసి పండ్లను కూడా సన్నగా తరిగి పెట్టుకోవాలి.. బెల్లాన్ని కూడా తురిమి పెట్టుకొని దాన్ని మనం ముందుగా నానబెట్టిన చింతపండు గుజ్జులో కలపాలి. ఈ మిశ్రమంలో మిగిలిని పదార్ధాలు అన్ని వేసు ఒక అరస్పూన్ ఉప్పు వేసి కలుపుకోవాలి.. అంతే షడ్రుచుల ఉగాది పచ్చడి రెడీ..