శివ అనే శబ్దము చాలా గొప్పది. శివుడికి శ్మశానం ఎంతో ఇష్టమైన ప్రాంతం. చాలా మందికి శివుడు శ్మశానంలో ఎందుకు కొలువై ఉన్నాడనే సందేహం ఉంటుంది. పార్వతీ దేవికి కూడా ఇదే సందేహం రావడంతో శివుడిని ప్రశ్నించింది. శివుడు ఆ ప్రశ్నకు సమాధానంగా లోకంలో ఉగ్రమైన భూతములన్నీ కొలువై ఉన్న ప్రదేశం శ్మశానం అని... భూత ప్రేతాత్మలు శ్మశానంలో ఏ ఒక్క పుణ్యకార్యం జరగకుండా అడ్డుకుంటూ ఉండటంతో దీన్ని గమనించిన బ్రహ్మ శ్మశానంలో ఉండి అక్కడ తప్పొప్పులను సరిదిద్దుతూ వారిని అదుపు ఆజ్ఞల్లో ఉంచాలని సూచించారని చెప్పారు. 
 
అప్పటినుండి శివుడు శ్మశానంలో ధ్యానం చేస్తున్నారు. శివుడు శ్మశానంలో కొలువై ఉండటానికి మరో కారణం కూడా ఉంది. ఆకలితో అలమటించే పేదవాడైనా... కోట్ల రూపాయలు సంపాదించిన శ్రీమంతుడైనా చనిపోయాక శ్మశానానికే రావాలి. భగవంతుని దృష్టిలో అందరూ సమానమని లోకానికి చాటి చెప్పాలనే ఉద్దేశంతో శివుడు శ్మశానంలోనే కొలువై ఉంటున్నాడు. 
 
ఏ వ్యక్తి అయినా చనిపోయిన తరువాత అతనిని శ్మశానంలో ఒంటరిగా వదిలిపెట్టి వెళ్లిపోతారు. అలా శ్మశానంలో ఉన్నవాళ్లకు తాను తోడుగా ఉంటానని... ఈ కారణాల వల్లే తాను శ్మశానంలో ధ్యానం చేస్తున్నానని శివుడు పార్వతికి చెప్పాడు. మనిషికి మరణం ఉంటుందేమో కానీ ఆత్మకు మరణం లేదని... మనిషి అంతిమంగా చేరే ప్రదేశంలో శివుడు నివశిస్తాడు. 

మరింత సమాచారం తెలుసుకోండి: