రేపు శ్రీరామనవమి.. శ్రీరామనవమికి స్పెషల్ వంతం ఏదైనా ఉంది అంటే అది పానకం, వడపప్పు అనే చెప్పాలి. అయితే ఈ వంటకం చెయ్యడానికి స్పెషల్ ఏంటి అంటే? ఈ పండుగ వేసవికాలంలో వస్తుంది కాబట్టి వీటిని ప్రసాదరూపంలో తీసుకోవడం వల్ల ఆరోగ్యం బాగుంటుంది అని ఆయుర్వేద పండితులు అభిప్రాయం వ్యక్తంచేస్తున్నారు. ఇంకా ఈ శ్రీరామనవమి నాడు స్పెషల్ వంటకంగా పానకం చేస్తారు. అయితే పానకం ఎలా చెయ్యాలి అనేది ఇక్కడ చదివి తెలుసుకోండి. 
 

కావలసిన పదార్థాలు... 

 

బెల్లం - 3 కప్పులు,

 

మిరియాల పొడి - 3 టీ స్పూన్లు,

 

ఉప్పు - చిటికెడు,

 

శొంఠిపొడి - టీ స్పూన్,

 

నిమ్మరసం - మూడు టీ స్పూన్లు,

 

యాలకుల పొడి - టీ స్పూన్,

 

నీరు - 9 కప్పులు. 

 

తయారీ విధానం... 

 

మూడు కప్పుల బెల్లాన్ని మెత్తగా కొట్టి నీళ్ళలో కలుపుకోవాలి. బెల్లం మొత్తం కరిగాక.. పలుచని క్లాత్‌లో వడకట్టాలి. ఇందులో మిరియాలపొడి, శొంఠి పొడి, ఉప్పు, యాలకల పొడి, నిమ్మరసం వేసి బాగా కలపాలి. అంతే శ్రీరామ నవమి స్పెషల్ వంటకం పానకం రెడీ. ముందు దేవుడుకు పానకం నైవేద్యంగా పెట్టి ఆతర్వాత పానకం తాగితే మంచిది. 
 

మరింత సమాచారం తెలుసుకోండి: