
ఒకరోజు ఆ పరమాత్ముడు శివుడు తన నందీశ్వరునితో కలిసి భూలోకం నుంచి కైలాసం కి ప్రయాణిస్తుండగా, మండువేసవి కావడంతో సూర్యకిరణాల ఆయనపై పడి ఆ ప్రభావానికి కలిగిన స్వేదాన్ని తొలగించుకునే క్రమంలో ఒక స్వేద బిందువు అనుకోకుండా నేలమీద పడింది. ఆలా నేలమీద పడ్డ ఆ బిందువులోంచి పుట్టిందే ఆదిపరాశక్తికి ప్రతి రూపమైన పోలేరమ్మ జన్మించింది. అప్పుడు బాల్య రూపం లో వున్న పోలేరమ్మని చూసిన శివుడు ఎవరు అని పోలేరమ్మని అడగగా తాను ఆయన కుమార్తెను సెలవిచ్చింది. తన జననానికి గల కారణాన్ని తెలిపింది. అది విన్న శివుడు పోలేరమ్మ ని కూడా తనవెంట తీసుకువెళ్ళాలని నిర్ణయించుకుని తిరిగి కైలాసానికి చేరాడు.
అలా ప్రయాణిస్తూ ఉండగా మార్గమధ్యలో సూర్యాస్తమయం కావడంతో ఆ రాత్రికి వారు అక్కడే ఉండబోతున్నట్లు శివుడు చెపుతాడు. ఇక వారికి తినడానికి కావలసినవన్నీ సమకూరుస్తాడు. శివుడు తనతోపాటి పోలేరమ్మకు, నదీశ్వరునికి కూడా ఆహారంగా ఇవ్వగా పోలేరమ్మ తనకు ఆ ఆహరం సరిపోదని తన ఆకలి తీరాలంటే ఇంకా చాలా ఆహరం కావాలంటూ శివునికి చెప్పింది. శివుడు మరికొంత ఆహరం తెచ్చి పోలేరమ్మకి వడ్డించాడు. అప్పటికి తన ఆకలి తీరలేదని, తనకు ఇంకా కావాలని పోలేరమ్మ కన్నీటి పర్యంతం అయ్యింది. ఆలా పోలేరమ్మ ఆకలి తీర్చడం లో విజయవంతం కాలేని శివుడు, నందీశ్వరుడు ఇద్దరూ కూడా అలసి నిద్రలోకి జారుకున్నారు. ఆలా పోలేరమ్మ గాఢనిదుర లో ఉండగా మధ్య రాత్రి నిదురలేచిన శివుడు, పోలేరమ్మని అక్కడే వదిలిపెట్టి తన నంది ని మాత్రం వెంటబెట్టుకొని కైలాసానికి వెళ్ళిపోయాడు.
మరుసటిరోజు నిద్రలేచిన పోలేరమ్మ శివుడు మరియి నందిఈశ్వరుడు కనపడకపోవడంతో వారికోసం శోదించింది. ఎంత గాలించినా వారు కనిపించకపోవడంతో పోలేరమ్మ వేదనతో రోదించింది. ఆలా కొంతసమయం తర్వాత తన అసలురూపం ఆది పరాశక్తి అని జ్ఞాపకం వచ్చింది. దాంతో పోలేరమ్మ శివుడికి ఒక గుణపాఠం చెప్పాలని అనుకుని భూతలంపైనున్న అన్ని బసవన్నలను తన నియంత్రణలోకి తెచ్చుకుంది. ఆలా ఏ బసవన్న కూడా పనిచేయక పోవడంతో ప్రజలకు కష్టాలు మొదలయ్యాయి. దాంతో ప్రజలు తమకష్టాలనుంచి తొలగించమని ప్రజలందరూ పోలేరమ్మకి పూజలు చెయ్యడం ప్రారంభించారు. ఆలా పోలేరమ్మ ని పూజిస్తూ ఆ క్రమంలో శివుడిని పూర్తిగా మరచిపోయారు ప్రజలు. అలా అక్కడే పోలేరమ్మకి ఒక ఆలయాన్ని కూడా నిర్మించారు.
అయితే ఈ సంఘటన అంతా దివ్యదృష్టితో వీక్షిస్తున్న శివుడు మాత్రం ఎలాగైనా తన ఆధిపత్యాన్ని తిరిగి పొందాలని ఒకరోజు రాత్రి పోలేరమ్మ ఆలయాన్ని పడగొట్టడానికి ప్రయత్నించాడు. ఆ విషయం తెలుసుకున్న పోలేరమ్మ కోపం తో శివుడిని యుద్ధంలో ఓడించింది. అప్పుడు శివుడు తాను ఆయన కుమార్తె అని గుర్తుచగా తన కోపోద్రేకాన్ని నియంత్రించుకున్న పోలేరమ్మ శివుణ్ణి తన పైన ఎక్కించుకుంది. ఆ సందర్భంలో శివుడుకూడా ఆదిపరాశక్తి స్వరోపమైన పోలెరమ్మను అందరు దేవత దేవుళ్లకంటే గొప్ప శక్తివంతురాలైనదిగా పూజిస్తారు.