హనుమాన్, ఏడుగురు చిరంజీవులలో ఒకడు మరియు శ్రీరాముడికి ప్రచండమైన భక్తుడు. హిందూ మతం పురాణాలలో అత్యంత ప్రసిద్ధమైన పాత్రలలో హనుమంతుని పేరు ప్రముఖం. తన యొక్క భక్తిప్రపత్తులతో రాముని గుండెలలో దాచుకున్న మహానుభావుడు హనుమంతుడు. అలాంటి ఈ హనుమంతుడికి దేశవ్యాప్తంగా ఎన్నో అలయాలు ఉన్నాయి. అయితే విశిష్టమైన దేవాలయాలలో మాత్రం గండి `వీరాంజనేయ స్వామి` ఖచ్చితంగా ఉంటుంది. ఈ ఆలయం కడపజిల్లా వీరన్నగట్టుపల్లి గ్రామంలో ఉంది. ఇక్కడ పాపఘ్ని నది ఉంది. గండి అనగా నది ప్రవహించే ఇరుకైన లోయ. ఇక్కడి ఆలయం అటువంటి ప్రదేశంలో ఉన్నందున స్వామికి ఆ పేరు మీద వీరాంజనేయ స్వామి వచ్చిందని చెబుతారు.
అసలు ఆ స్వామి ఇక్కడ వెలియడానికి ప్రధాన కారణం ఆ శ్రీరాముడే అంటున్నారు. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. రాముడు అరణ్యవాస సమయంలో సీతను వెతుకుతూ ఈ దారిన వెడుతుండగా ఇక్కడ తపస్సు లో ఉన్న వాయుదేవుడు శ్రీరాముణ్ని తన ఆతిథ్యం స్వీకరించమని కోరాడు. అయతే తిరుగు ప్రయాణంలో వస్తానని రాముడు బదులిచ్చాడు. ఆ విధంగా లంక నుంచి సీతాపరివార సహితుడై వచ్చే సమయంలో అక్కడకు వస్తారని వాయుదేవుని తెలుసుకున్నాడట. దీంతో అక్కడ తన తప:శక్తిని వినియోగించి ప్రక`తిని అందంగా తీర్చిదిద్దుతాడు. ముఖ్యంగా గండి క్షేత్రానికి దగ్గరగా బంగారు తోరణాన్ని నిర్మిస్తాడు. రెండు కొండలను వేరుచేసే పాపాగ్నీ నది పై నిర్మించిన ఆ బంగారు తోరణం సూర్య రశ్మి సోకి విభిన్న అందాలతో శ్రీరామ చంద్రుడికి స్వాగతం పలుకుతుంది.
ఇక ఇప్పటికీ ఆ తోరణం రెండు కొండల మధ్య అదృశ్యంగా ఉందని, అది కొందరికే కనిపిస్తుందని వారికి పునర్జన్మ ఉండదని చెబుతారు. ఇక అక్కడ శ్రీరామ చంద్రుడు, సీత, లక్ష్మణుడు కొంతకాలం గుడుపుతారు. ఈ క్రమంలోనే శ్రీరాముడు తనకు యుద్ధంలో సహాయం చేసిన హనుమంతుడిని తలుచుకొంటూ విగ్రహాన్ని అందంగా చెక్కుతాడు. అయితే ఇంతలోనే అయోధ్యకు చేరే సుముహుర్తం దగ్గర పడడంతో.. ఆంజనేయుడి విగ్రహాన్ని పూర్తి చేయకుండానే అయోధ్యకు బయలుదేరుతాడు. శ్రీరాముడు. ఇందుకు ప్రతీకగా ఇక్కడ ఆంజనేయుడి కాలికి చిటికిన వేలు ఉండదు. ఆ చిటికెనవేలును చెక్కేందుకు ఎవరు ప్రయత్నించినా స్వామివారి విగ్రహం నుంచి రక్తం వస్తుంది. అందుకే ఇక్కడి మూర్తిని సజీవ ఆంజనేయ స్వామి మూర్తిగా పేర్కొంటారు