
సూర్య గ్రహణం.. ప్రతి ఏడాది వస్తూనే ఉంటాయి. భూమికి సూర్యుడికి మధ్య చంద్రుడు వచ్చినప్పుడు, భూమి మీద కొంత భాగానికి సూర్యుడు పూర్తిగా గానీ, పాక్షికంగా గానీ కనబడకుండా పోవడం వలన సూర్య గ్రహణము ఏర్పడుతుంది. సూర్య గ్రహణము అమావాస్య నాడు మాత్రమే వస్తుంది. ఇక కరోనా మహమ్మారి సర్వమానవాళినీ భయపెడుతున్న ఈ సమయంలో... ఈ నెల 21వ తేదీన తొలి సూర్యగ్రహణం ఏర్పడనుంది. హిందు క్యాలెండర్ ప్రకారం మిథున రాశిలో (మృగశిర నక్షత్రం) జ్యేష్ఠమాసం కృష్ణపక్షం రోజు గ్రహణం రానుంది.
ఉదయం 10.25 నిమిషాల నుంచి మధ్యాహ్నం 1.54 గంటల వరకూ గ్రహణం వుంటుంది. పూర్తి ప్రబావం మధ్యాహ్నం 12.18 గంటలకు కనిపించనుంది. ప్రాచీన కాలంలో గ్రహణాలను అశుభ సూచకముగా భావించేవారు. ఇప్పటికీ ప్రపంచంలో కొన్ని ప్రాంతాల ప్రజలు వీటిని అశుభ సూచకంగానే భావిస్తారు. అయితే ఈ సందర్భంగా జ్యోతిష పండితులు పలు విషయాలను వెల్లడించారు. ఇది మిథున రాశిలో సంభవిస్తోంది కాబట్టి, మృగశిర, ఆరుద్ర, పునర్వసు నక్షత్రాలవారు చూడకూడదని పండితులు చెబుతున్నారు.
మేషం, కన్య, మకర, సింహ రాశుల వారికి ఈ గ్రహణం శుభ ఫలితాలను ఇస్తుందనీ, వృషభ, ధనుస్సు, తుల, కుంభ రాశులకు మధ్యమ ఫలం లభిస్తుందనీ, మిథునం, వృశ్చికం, కర్కాటకం, మీన రాశులకు అధమ ఫలం ఉంటుందనీ జోస్యుల మాట. గ్రహణం సంభవించే మిథున రాశి వారు శాంతులు చేయించుకోవడం శ్రేయస్కరమని వారి సూచన. ఇక గ్రహణ పట్టు, విడుపుల సమయం మధ్య పగలు తీసుకునే ఆహారాన్ని తీసుకోకుంటేనే మంచిదని సూచిస్తున్నారు.
ఇక్కడ మరో విషయం ఏంటంటే.. ఆదివారం గ్రహణం సంభవించడం అంటే మాహా విశేషం. ఆలాగే అంతే ప్రమాదం కుడానూ, ఏ సంవత్సరంలోనైనా చెత్రమాసం మొదలుకుని మల్లి చైత్ర మాసం వరకు ఐదు గ్రహాణాలు ఏర్పడతాయో ఆ సంవత్సరం ప్రకృతి విపత్తులు అనేవి సంభవిస్తాయి. ఇలా మనకు 2011లో వచ్చింది. అలాగే ఈ సంవత్సరం సంభవించనున్నది. దీంతో ఈ ఏడాది ప్రకృతి వైపరీత్యాలు వచ్చే అవకాశం ఎక్కువగా ఉన్నాయంటున్నారు, కాగా, ఈ గ్రహణం ప్రపంచ వ్యాప్తంగా ప్రభావం ఉంటుంది. ముఖ్యంగా భారతదేశం, పాకిస్తాను, చైనా, ఆఫ్రికా దేశాలలో ప్రభావం ఎక్కువగా ఉంటుంది.