భారతీయ సంప్రదాయంలో ఉపవాసాలకు ఎంతో ప్రాముఖ్యత ఇవ్వడం జరిగింది. మన అన్ని పురాణాలు మరియు ఇతిహాసాలు ఆత్మజ్ఞానం కలగడానికి ఉపవాసాన్ని ఓ సాధనంగా సూచించారు. పద్మపురాణాలు, విష్ణుపురాణం, భాగవతం మొదలైనవి ఏకాదశి వ్రతంలో (ఉపవాసాన్ని ఒకానొక రోజు చేయాలని) పాటించే ఉపవాసం ఎంతో శుభప్రదమని చెప్పినాయి. తిండి మానేసి కూర్చోవడమే ఉపవాసం అనుకోవటం పొరపాటు, ఉపవాసంతో కూడిన భగవధ్యానం సంపూర్ణ ఉపవాసంగా భావించవచ్చు. మనసు దుష్ట తలంపుల నుండి మరియు ప్రాపంచిక ఆందోళనల నుండి విడివడి వుండటం అవసరం. ఉపవాసం దీక్షలో మనిషికి శద్దత్వం ఓ నియమంగా చెప్పపడింది. అలా మానసిక పారిశుధ్దత భక్తితో కూడిన ధ్యానం లేకుంటే ఉపవాసం అంటే తిండిలేక అలమటించడమే అవుతుంది. ఏకాదశి రోజులలో నెలకు రెండు రోజులు పూర్తి ఉపవాసాన్ని పాటించాల్సిందిగా చెప్పడం జరిగింది. అలాగే షష్ఠి రోజులలో నెలకు రెండుసార్లు రోజులో కొంతబాగం ఉపవాసం పాటించాల్సిందిగా తెలపబడింది. ఈ రోజుల్లో ఉపవాసాన్ని పాటించడంవల్ల భగవంతుడి కృపను నిస్సందేహంగా పొందవచ్చు. అధునిక సైన్స్ ప్రకారం ఉపవాసం శరీరానికి మరియు మనసుకు ఎంతో ప్రాయోజనకారి, ప్రార్థనలు, ధ్యానం మరియు శుభకరమైన మంచి ఆలొచన మనసును చైతన్యవంతం చేసి ఏకాగ్రత మరియు ఆత్మస్థైర్యమనే శక్తిని పెంచుతాయి. శరీరాన్ని మాత్రమే పరిగణలోకి తీసుకున్నట్లయితే ఉపవాసం రక్తాన్ని మరియు జీర్ణవ్యవస్థని శుద్దిచేస్తుంది. ఎపుడు కడుపు నిండుగా ఉంటాయి. జీర్ణవ్యవస్థకు కాస్త విరామం కలిగించడం కోసం ఉపవాసం ఎంతో సహకరిస్తుంది. అలా శరీరానికి అలా శుద్దికూడా ఉపవాసం కలిగిస్తుంది. అలా శరీరంలో అవసరానికి మించి వున్న కొవ్వు మరియు ఇతరాలు ఉపవాసం దీక్షలు శరీరానికి మరియు మనసుకు ఎంతో క్షేమం కలిగిస్తాయి.  

మరింత సమాచారం తెలుసుకోండి: