ఆంజనేయుడు, హనుమంతుడు, హనుమాన్ ఇలా రకరకాల పేర్లు కలిగి ఉన్నా ఆ ఆంజనేయస్వామికి కోట్లలో భక్తులు ఉన్నారు. శ్రీరామభక్తుడైన ఆంజనేయస్వామిని స్మరిస్తే సకల భూత, ప్రేత, పిశాచ భయాలు తొలగిపోతాయని భక్తులు విశ్వసిస్తారు. . ఈ జగమందు సప్త చిరంజీవులలో హనుమంతుడు ఒకరు.
అలాంటి ఆంజనేయస్వామికి దేశవ్యాప్తంగా ఎన్నో ఆలయాలు ఉన్నాయి. అయితే ఓ ఆలయంలో మాత్రం ఆంజనేయస్వామి మీసాలతో దర్శనమిస్తాడు.
గుజరాత్ లోని భావనగర్ దగ్గర్లోని సారంగపూర్ లో ఈ అరుదైన హనుమంతుడి దేవాలయం ఉంది. ఈ హనుమాన్ దేవాలయాన్ని కష్టభంజన్ హనుమాన్ దేవాలయం అంటారు.
ఈ ఆలయంలో హనుమంతుడు మీసాలతో దర్శనమిస్తూ, కాలి కింద ఆడ రాక్షసిని తొక్కుతున్న దృశ్యం, హనుమంతుడి విగ్రహం వెనుకాల కోతులు పండ్లని పట్టుకున్న దృశ్యం భక్తులను ఎంతగానో ఆకర్షిస్తుంది. అంతేకాదు, ఇక్కడ హనుమంతుడు బంగారు సింహాసనంలో కుర్చొని ఉంటాడు. అలాగే ఈ హనుమంతుడిని వజ్రాల కిరీటంతో అలంకరిస్తారు. మరియు హనుమంతుడి గద కూడా బంగారంతో చేయబడి ఉంటుంది.
అయితే ఇక ఈ ఆలయాన్ని దయ్యం పట్టినవారు ఎక్కువగా దర్శిస్తుంటారు. దయ్యం పెట్టినవారు ఈ దేవాలయంలో మూడు రోజులు నిద్రిస్తే విముక్తి పొందుతారని భక్తుల విశ్వసిస్తారు. కాగా, ఈ ఆలయంకు ప్రతి రోజూ వేల సంఖ్యంలో భక్తులు వస్తుంటారు. ముఖ్యంగా ప్రతి మంగళ, శనివారాల్లో ఆ సంఖ్యల లక్షకు చేరుతుందని అంటున్నారు.