వినాయకుడిని చూడగానే చాల మందికి చాల ప్రశ్నలు వస్తాయి. అసలు వినాయకుడికి ఏకదంతం ఎందుకు ఉంది. అసలు వినాయకుడికి ఏకదంతుడిగా పేరు ఎందుకు వచ్చింది అనే ప్రశ్నలను వెంటాడుతూ ఉంటాయి. అయితే ఇది చదివేసి మీ సందేహాలను తీర్చుకోండి.

వినాయకుడికి ఏకదంతం ఉంటుంది. ‘ఏకదంత' అంటే ‘ఒకే పన్ను'అని అర్ధం. అయితే ఏకదంత, వినాయకుడి 32 రూపాలలో 22 వ రూపంగా చెప్తారు. దేవుడు ఈ రూపాన్ని అహంకార రాక్షసుడైన మదాసురని నిర్మూలించడానికి ధరించాడని  చెప్పుతాయి. వినాయకుడి ఏకదంత రూప పుట్టుకపై కొన్ని ప్రసిద్ధ పురాణ కధలు ఉన్నాయి. ఒకసారి శివుని పరమభక్తుడైన పరశురాముడు.

అయితే ఓసారి పార్వతీపరమేశ్వరుల దర్శనం కోసం పరశురాముడు కైలాసానికి వచ్చాడు. అతను నేరుగా లోపలికి వెళ్లబోతుండగా అక్కడ వినాయకుడు అడ్డుకున్నాడు. తన తల్లిదండ్రుల అనుమతి తీసుకుని వచ్చిన తరువాతనే లోపలికి పంపిస్తానని చెప్పాడు. పరశురామునికి వినాయకుని ధోరణ ఆగ్రహాన్ని కలిగిస్తాడు. అయితే అప్పుడు పరశురాముడు ఇలా అంటారు.

పార్వతీ పరమేశ్వరులకు నేను కూడా పుత్రుడినేనని వినాయకుడితో అంటాడు. అలాగే నా తల్లిదండ్రుల దర్శననానికి అనుమతి అవసరం లేదని పరశురాముడు లోపలికి వెళ్లబోతాడు. వినాయకుడు ఎంతగా చెప్పిన వినిపించుకోకపోవడంతో తన తొండంతో పరశురాముని గట్టిగా చుట్టేసి గిరగిరా తిప్పుతూ సప్త సముద్రాల్లో ముంచేసి మళ్లీ కైలాసానికి తీసుకొస్తాడు.
 
ఆ తరువాత పరశురాముడు ఆగ్రహంతో తన చేతిలోని గొడ్డలిని గణపతిపై విసురుతాడు. దాంతో గణపతికి దంతం విరిగిపోతుంది. అంతలో పార్వతీపరమేశ్వరులు బయటకి వస్తారు. అదే సమయంలో విష్ణుమూర్తి కూడా అక్కడికి వస్తాడు. గణపతి గాయం చూసి పార్వతి కన్నీళ్లు పెట్టుకుంటుంది. అప్పుడు విష్ణుమూర్తి పార్వతిని బాధపడొద్దనీ చెప్పి, ఇక గణపతి ఏకదంతుడు అనే పేరుతో పిలువబడుతాడని వారికీ చెప్పుతాడు. దీంతో నాటి నుండి నేటివరకు వినాయకుడిని ఏకదంతుడిగా పూజిస్తారు. అంతేకాక వినాయకుడు, వేదవ్యాసునికి రచయితగా ఉన్నపుడు మహాభారతాన్ని రాసేటపుడు అతని దంతాలలో ఒకదాన్ని కాలంగా ఉపయోగించారని మరో కధ కూడా ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి: