
శివాలయంలో అయితే అభిషేకం చేసిన నీటిని లేదా పంచామృతాన్ని ఇస్తారు. ఈ తీర్ధమును అర్చన పూర్త అయిన వెంటనే ముందుగా అర్చక స్వామి తీసుకుని తర్వాత తన్మయులైన వారికీ, సన్యసించిన వారికినీ , అధ్యాపకులకూ యజమానులైన ధర్మకర్తలకునూ ఆ తర్వాత భక్తులకు వరుసగా ఇవ్వడం జరుగుతుంది. తీర్ధమును ఎలా తీసుకోవాలి అనే ప్రశ్నకు సమాదానం మగవారు తన భుజంపై ఉన్న ఉత్తరీయం లేదా కండువాను, ఆడవారు తమ చీర లేదా చున్ని పైట కొంగును ఎడమ చేతిలో నాలుగు మడతలు వచ్చే విధంగా వేసుకోవాలి. ఎడమ చేతిలో ఉన్న గుడ్డ మడతలో కుడి చేతిని ఎడమ చేతిలో వేసి చూపుడువేలు ఏ మాత్రం తగలకుండా బ్రొటన వేలును నడిమి వ్రేలి క్రింద కణుపునకు పెట్టి గట్టిగా నొక్కి పట్టి తీర్ధం క్రింద పడనీయకుండా నోటి శబ్దం రాకుండా ఓం అచ్యుత, అనంతా, గోవిందా అనే నామాలను స్మరిస్తూ భక్తిశ్రద్ధలతో వినమ్ర పూర్వకంగా త్రాగాలి. ...
తీర్దం త్రాగిన తర్వాత కుడి చేతిని తలపై రాసుకోవద్దు. తలపైన బ్రహ్మదేవుడు ఉంటాడు....మన ఎంగిలిని బ్రహ్మకు అర్పణం చేసిన వారమవుతాం. తీర్ధం త్రాగునప్పుడు జుర్రుమని శబ్దం రానియకుండా తాగాలి. తీర్థాన్ని మూడుసార్లు తీసుకోవాలి....అలా మూడు సార్లు ఎందుకు తీసుకోవాలనే విషయం చాలామందికి తెలియదు. మొదటిసారి తీర్థం శారీరక, మానసిక శుద్థి జరుగుతుంది. రెండోసారి తీర్థం న్యాయ ధర్మ ప్రవర్తనలు చక్కదిద్దుకుంటాయి. మూడోది పవిత్రమైన పరమేశ్వరుని పరమ పదం అనుకుంటూ తీసుకోవాలి....