ఇక కార్తీక మాసంలో నదీ స్నానం శివారాధన దీపారాధన దీపదానం విష్ణు ఆరాధన దానం ఇలాంటివి చేయడం ద్వారా ఎంతో శుభం కలుగుతుందని అటు హిందువులు విశ్వసిస్తూ ఉంటారు. కార్తీక మాసంలో ప్రతిరోజూ దీపాలు వెలిగిస్తూ శివకేశవులను ఆరాధిస్తూ ఉంటారు. ఇక శివకేశవులను కార్తీకమాసంలో నిష్ఠతో ఆరాధించడం ద్వారా పుణ్యం కలిగి జ్ఞానం సిద్ధించి సుఖసంతోషాలు కలుగుతాయని భక్తుల ప్రగాఢ విశ్వాసం. కార్తీక మాసంలో స్నానం.. దీపం.. ఉపవాసం.. దానం లాంటి 4 పద్ధతులను ఎక్కువగా పాటిస్తూ ఉంటారు.
ముఖ్యంగా కార్తీక మాసంలో నదీ ప్రవాహానికి ఎదురుగా నిలబడి స్నానమాచరించడం వలన మానవుని శరీరం శక్తి కలిగి ఆరోగ్యం సిద్ధిస్తుందని అందరూ నమ్ముతారు. అంతేకాదు కార్తీక మాసములో పుణ్య నదీ స్నానాల వల్ల పాపాలు తొలగిపోతాయని అందరూ ప్రగాఢంగా విశ్వసిస్తారు. ఇక దీపం జ్యోతి పరబ్రహ్మ అని అంటారు... దీపంలో లక్ష్మీదేవి ఉందని విశ్వసిస్తారు అందుకే కార్తీక మాసంలో ఎక్కువగా దీపాలు వెలిగిస్తారు. దీపాలను వెలిగించడం ద్వారా ఎంతో మంచిది.
ఇక చాలామంది కార్తీకమాసంలో చాలా మటుకు నిత్య దీపారాధన చేయడానికి ఎక్కువగా ఆసక్తి చూపుతుంటారు. కార్తీక మాసంలో ఎంతో మంది ఉపవాస దీక్షలు కూడా చేపడుతుంటారు. ఉపవాస దీక్ష చేపట్టడం వల్ల ఆరోగ్యం మెరుగుపడటంతో పాటు మనసు కూడా ఎంతో నిర్మలంగా ఉంటుంది ఇక దైవచింతనతో ఉపవాస దీక్ష చేపట్టడం ద్వారా పుణ్యం కలుగుతుందని భక్తులు విశ్వసిస్తారు. ఇక కార్తీక మాసంలో సనాతన ధర్మం ప్రకారం దానం చేయడం ముఖ్యమైనది. ఇక ఇలా దానం చేయడం ద్వారా పుణ్యఫలం లభిస్తుందని అటు హిందూ పురాణాలు కూడా చెబుతున్నాయి. ఇలా కార్తీకమాసంలో ఈ నాలుగు పద్ధతులలో తప్పక పాటిస్తారు భక్తులు.