సాధారణముగా వారి వారి మతాలను బట్టి కొన్ని కొన్ని పండుగలను నిర్దేశించారు మన పూర్వీకులు. అదేవిధంగా అన్ని పండుగలు ఒకేసారి ఒకే కాలంలో రావు. కొన్ని పండుగలు ఒకసారి మరికొన్ని పండుగలు మరొక సమయంలో వస్తూ ఉంటాయి. ఎందుకంటే మన దేశం బహు భాషలు మాట్లాడే వారున్న దేశం. ఇక్కడ వివిధ  మతాలు, వివిధ కులాలు మరియు వివిధ భాషలు వారు నివసిస్తుంటారు. తద్వారా ఒకరు పండుగ జరుపుకుంటుంటే వేరేమతం వారు ఆ పండుగను కలిసి జరుపుకుంటారు. ఈ విధంగా మనము కలిసి మెలసి ఉండడం వలన ప్రపంచ దేశాలు కూడా మన దేశం అంటే ఎంతో సాంప్రదాయ దేశంగా చూస్తుంది.

అదేవిధంగా ఇక్కడ సిక్కు మతస్థులకు గురునానక్ జయంతి అనేది చాలా ముఖ్యమైన పండుగ. ఇది వారి మొదటి మత గురువైన గురునానక్ గారి పుట్టిన రోజుకు ప్రతీకగా పండుగ లాగా జరుపుకుంటారు. ఈ పండుగను ఒక్క భారతదేశంలోనే కాక ప్రపంచవ్యాప్తంగా ఉన్న సిక్కులంతా ఎంతో సంతోషంగా జరుపుకుంటారు. ఈ పండుగ ప్రతి సంవత్సరం అక్టోబర్ లేదా నవంబర్ నెలలో వస్తూ ఉంటుంది. ఈ సంవత్సరం నవంబర్ 30వ తేదీన గురునానక్ జయంతిని జరుపుకుంటారు. ఇదే రోజు కార్తీక పౌర్ణమి కావడం మరో విశేషం.

గురుదేవ్ గారి అనుసరించిన ఆధ్యాత్మిక మరియు ఆదర్శవంతమైన మార్గం ఎంతో మంది ప్రజలకు స్ఫూర్తిగా నిలిచిందని చెప్పవచ్చు. ఎందుకంటే ఈ పర్వదినాన ఎంతోమంది సిక్కులు అంకిత భావంతో ఈ పండుగను జరుపుకుంటారు. ఈ రోజు ప్రతి ఒక్కరూ గురు ద్వారాలకు హాజరవుతారు. ఒకవేళ అవకాశం లేని వాళ్ళు ఇంటి దగ్గరే ఉండి వేడుకలు నిర్వహిస్తూ ఉంటారు.  అంతేకాకుండా ఈ పండుగ రోజున అందరికీ భోజనాన్ని ఏర్పాటు చేస్తారు. ప్రజలంతా ఇందులో ఎటువంటి వర్గ బేధం లేకుండా చేరుతారు. దీనిని ఒక ఐక్యతకు చిహ్నంగా చెప్పుకుంటారు.

మరింత సమాచారం తెలుసుకోండి: