సంవత్సరం పొడుగునా ఏదో ఒక పండుగ మనందరినీ సంతోషానికి గురిచేస్తుంది. అన్ని పండుగలు ఒక ఎత్తయితే సంవత్సరం చివరన వచ్చే క్రిస్మస్ పండుగ చాలా ప్రత్యేకం. డిసెంబర్ నెల మొదలైతే చాలు క్రిస్టియన్స్ అందరూ క్రిస్మస్ గురించే చర్చించుకుంటూ ఉంటారు. మాములుగా క్రైస్తవులు క్రిస్మస్ కంటే, క్రిస్మస్ రాత్రిని ఘనంగా జరుపుకుంటారు. దీనిని యేసు క్రీస్తు పుట్టినరోజుగా పిలుచుకుంటారు.  అసలు క్రిస్మస్ రాత్రి అంటే ఏమిటో తెలుసా...? క్రిస్మస్ కు ముందు రోజు వచ్చే రాత్రిని క్రిస్మస్ రాత్రి అంటారు. ఆ రోజు రాత్రి క్రైస్తవులంతా సాంప్రదాయ బద్దమైన వేడుకలకు హాజరవుతారు. మరి ఈ రోజు రాత్రి ఏమి జరుగుతుందో...అంత ప్రత్యేకత ఏమిటో తెలుసుకుందామా...!

ఆ రాత్రి ముఖ్యంగా కుటుంబమంతా కలిసి మెలసి వేడుకలలో పాల్గొంటారు. అంతేకాకుండా ఇందులో అందరూ చాక్లేట్లు తింటారు మరియు క్రిస్మస్ కథలను వింటారు. ఈ కథలు కూడా యేసు గురించి, ఆయన జననం గురించి ఉంటాయి..అన్నింటికంటే ముఖ్యంగా క్రిస్మస్ గీతాలను ఆలపిస్తారు. ఈ గీతాల ద్వారా వారు ఒకరి మీద ఒకరికి ఉన్న ప్రేమను, గౌరవాన్ని తెలుసుకుంటారు. అలాగే ఇతరులకు సహాయపడాలని నేర్చుకుంటారు. ఇలా చేయడం వలన వారు చాలా ఆనందానికి గురవుతారు.  ఈ రోజున క్రైస్తవులంతా గీతాలను ఆలపిస్తూ నృత్యాలు చేస్తూ దగ్గర ఉన్న అనాధ శరణాలయాలకు లేదా ఇళ్లకు వెళ్లి క్రీస్తు గురించి బోధిస్తారు. ఈ విధంగా క్రీస్తు పుట్టిన ఆనందమైన రోజును వారితో పంచుకుంటారు.

ఇదే రోజున ఎందరో వారి వారి ఇళ్లలో క్రిస్మస్ కేక్ ను తయారు చేసుకుంటారు...దీనిని మనం ఫ్రూట్ కేక్ అని కూడా అంటాము...ఇలా చేసిన కేక్ ను వారి దగ్గర ఉన్న వారితో పంచుకుని సరదాగా ఉండాలని చెబుతారు. క్రిస్మస్ రాత్రి ముఖ్యమైన సాంప్రదాయ సంఘటనలలో ఒకటి స్వీట్లు లేదా బహుమతులతో నింపబడి ఉంటుంది. ముఖ్యంగా క్రిస్మస్ రాత్రి పిల్లలు నిద్రలో ఉన్నప్పుడు వారి తల్లిదండ్రులు వారి ప్యాంటులో స్టఫ్డ్ స్వీట్స్ లేదా బహుమతులు వేలాడదీస్తారు. ఆ సాక్స్‌లో నిండిన స్వీట్లు లేదా బహుమతులు క్రిస్మస్ రోజు ఉదయం నిద్రలేచిన పిల్లలకు అతి పెద్ద ఆశ్చర్యాన్ని ఇస్తాయి. శాంటా క్లాజ్ పిల్లలతో రాత్రి ఇంటికి వచ్చి బహుమతులు ఇస్తారని సాంప్రదాయకంగా నమ్ముతారు. అదే రోజున చర్చ్ కు వెళ్లి తమ రక్షకుడైన యేసు క్రీస్తుని ప్రార్ధించుకుని తిరిగి వస్తారు.

మరింత సమాచారం తెలుసుకోండి: