ఇక పోతే జనవరి నెల అనగానే అందరికీ టక్కున గుర్తొచ్చేది సంక్రాంతి పండుగ. ఇందులో జరిగే పొంగల్, కోడి పందేలు, జల్లికట్టు కార్యక్రమాలు అందరికీ గుర్తొస్తాయి. ఈ సారి ఏ రోజులలో ఈ పండుగలు వచ్చాయో ఇప్పుడు మన ఏపీహెరాల్డ్ ఆర్టికల్ ద్వారా తెలుసుకుందాము. జనవరి నెలలో 9 వతేదీన వచ్చే తొలి సఫాలా ఏకాదశి రోజున అనేక మంది ఉపవాసాన్ని పాటిస్తారు. ప్రతి సారి కృష్ణ పక్షంలో వచ్చే ఏకాదశినే సఫాలా ఏకాదశి అంటారు. కాగా ఈ రోజునే విష్ణుమూర్తిని కూడా ఆరాధిస్తారు. అలాగే జనవరి 10 వతేదీన కృష్ణ ప్రదోష్ వ్రతాన్ని ఆచరిస్తారు. ఆ వ్రతాన్ని పరమేశ్వరునికి ఇష్టమైనదిగా కొలుస్తారు. కృష్ణ పక్షంలోని చతుర్దశి లో ప్రతి మాసంలోనూ శివ రాత్రిని జరుపుకుంటూ ఉంటారు. ఈ నెలలో వచ్చే శివ రాత్రి రోజున అందరూ ఉపవాసం ఉంటారు. ఇది 11 వతేదీన వస్తుంది.
అలాగే జనవరి 13 వతేదీన భోగి పండుగ వస్తుంది. ఈ రోజు ఇంట్లో అందరూ ఉదయాన్నీ లేచి భోగి లో కాచిన వేడి నీళ్లతో స్నానం చేస్తారు. తమ ఇంటి ముందు రంగు రంగుల ముగ్గులు వేస్తారు. పిల్లలు పెద్దలు ఎంతో సంతోషంగా ఈ పండుగను జరుపుకుంటారు. తరువాత రోజు అంటే జనవరి 14 వ తేదీన మకర సంక్రాంతి వస్తుంది. సూర్య భగవానుడు ధనస్సు రాశి నుండి మకర రాశిలోకి సంచరించనప్పుడు మకర సంక్రాంతి అంటారు. మన తెలుగు రాష్ట్రాల్లో సంక్రాంతి సమయంలో కోడి పందేలు ఎక్కువగా నిర్వహిస్తారు. తమిళనాడు జల్లికట్టు ఉత్సవాలు నిర్వహిస్తారు. ఈ సమయంలో రైతుల పంట చేతికొచ్చి ఉంటుంది. అందుకే ఈ పండుగను మూడురోజుల పాటు ఘనంగా జరుపుకుంటారు. భోగి, సంక్రాంతి తర్వాత కనుమ పండుగ రోజున మాంసాహారం తీసుకుంటారు. ఇలా ఈ సంవత్సరం జనవరి లో వచ్చే పండుగల ఇవే...