
ఎందుకంటే ఒక్క హనుమంతుడు మాత్రమే ఇటువంటి గ్రహాల సమస్యల నుండి కాపాడుతాడని నమ్ముతారు. అంగారకుడు, శని, రాహు, కేతు వంటి పాపపు గ్రహాల వల్ల కలిగే చెడు ప్రభావాలను నివారించడానికి హనుమంతుడిని ఆరాధించడం చాలా ప్రయోజనకరం. ఇందుకు ప్రతి మంగళవారం ఆంజనేయ స్వామికి నీళ్ళు అర్పించి, ఆపై ఈ నీటిని ఎర్ర ఆవుకు ఇవ్వండి. అలాగే హనుమంతుడి చిత్రం ముందు మల్లె నూనెతో ఒక దీపం ఉంచండి. అదే రోజున పేదలకు అన్నదానం చేయడం ద్వారా మంచి జరుగుతుంది.
హనుమంత స్వామికి ఎంతో ప్రీతికరమైన వేరు శెనగ పిండితో చేసిన లడ్డూను నైవేద్యం పెట్టండి. దీనివలన చాలా ప్రయోజనము చేకూరుతుంది. జీవితంలో మంచి అదృష్టం తీసుకురావడానికి, మంగళవారం మోటిచూర్ లడ్డూపై లవంగాలను ఉంచవచ్చు. కాబట్టి అంగారక గ్రహ ప్రభావం ఉన్నవారు ఎటువంటి బాధ పడవలసిన అవసరం లేదు. ప్రతి మంగళవారం అలాగే ప్రతి శనివారం ఆంజనేయ స్వామి ఆలయాన్ని దర్శించి...మీ సమస్యను మొర పెట్టుకోండి. మీకు అంతా మంచే జరుగుతుంది. అయితే ఆంజనేయుని మంత్రాలను కూడా పఠించడం ఎంతో ప్రధానం. ఈ మంత్రాలను ప్రతి రోజూ మీరు పడుకునే ముందు ఒకసారి చదువుకొని పడుకుంటే అంతా మంచే జరుగుతుంది.