
సాష్టాంగ నమస్కారం అంటే అర్ధం...ఎనిమిది అవయవాలతో దేవుని నమస్కరించడం అని అర్ధం. "ఉరసా... శిరసా.... దృష్ట్యా... మనసా... వచసా... తథా పద్భ్యాం... కరాభ్యాం ...కర్ణాబ్యామ్... ప్రణామో ష్టాంగ ఈరితః...
అయితే ఈ అష్టాంగాలు అంటే ఏమిటో తెలుసా....
1) "ఉరసా" అంటే తొడలు,
2) "శిరసా" అంటే తల,
3) "దృష్ట్యా" అనగా కళ్ళు,
4) "మనసా" అనగా హృదయం,
5) "వచసా" అనగా నోరు,
6) "పద్భ్యాం" అనగా పాదములు,
7) "కరాభ్యాం" అనగా చేతులు,
8) "కర్ణాభ్యాం" అంటే ...
ఈ విధంగా పైన చెప్పబడిన 8 అంగములతో నమస్కారం చేయాలి. అయితే ఎందుకు ఇలా అన్ని అంగాలతో నమస్కారం చేయాలి...మానవుడు సహజంగా ఈ ఎనిమిది అంగాలతో తప్పులను చేస్తుంటాడు. అందుకనే దేవాలయంలో దేవుని ముందు బోర్లా పడుకుని ఎనిమిది అంగాలను నేలకు ఆనించి నమస్కారం చేయాలి. ఈ నమస్కారం కూడా ధ్వజస్తంభానికి వెనుక వైపు నుండి మాత్రమే చేయాలి.
ఇక్కడ ఇంకో విషయం కూడా ఉంది...స్త్రీలు సాష్టాంగ నమస్కారం చేయకూడదు. ఆడవాళ్లు పంచాంగ నమస్కారం మాత్రమే చేయాలని శాస్త్రాలు చెబుతున్నాయి. అంటే కాళ్లు, చేతులు, నుదురు మాత్రమే నేలకు తాకేలా స్త్రీలు నమస్కారం చేయాలని శాస్త్రం చెబుతుంది. దైవానికి, గురువులకు, యతులకు వారు ఎదురుపడిన వెంటనే సాష్టాంగ నమస్కారం చేయాలి. వంద యజ్ఞాలు చేసినా పొందని పుణ్యము..ఒక సారి సాష్టాంగ నమస్కారం చేస్తే కలుగుతుంది.