
మాములుగా మనకు తెలిసిన వాస్తవం ప్రకారం మంగళవారం హనుమంతుడికి పూజ చేస్తారు. ఆ రోజున మూగ ప్రాణులను చంపితే మహా పాపం చుట్టుకుంటుందని పురాణాలు చెబుతున్నాయి. మంగళవారం ఎవరైనా మాంసం తింటే... ఆ పాపం ఆ రోజు మాత్రమే కాక... ఆ తర్వాత కూడా కొనసాగుతుందని పండితులు చెబుతున్నారు. శనివారం మాంసం ఎలా తినకూడదని చెబుతారో అదే విధంగా మంగళవారం కూడా నాన్ వెజ్‌కి దూరంగా ఉండాలని సూచిస్తున్నారు. ఒక వేళ ఎవరైనా ఈరోజు మాంసము తింటే ఏమి జరుగుతుందో వివరంగా తెలుసుకుందాము.
ఆంజనేయుడిని పూజిస్తే మీ కోరికలన్నీ తీరుతాయని భక్తుల ప్రఘాడ విశ్వాసం మరియు నమ్మకం. ఎంతో మంది నిరుద్యోగులు ఆంజనేయుడిని పూజించడం ద్వారా ఉద్యోగాలు దొరుకుతాయని కోరిక. మీరు కనుక మంగళవారం చేపలు కానీ, కోళ్లు కానీ, పీఠాలు కానీ, రొయ్యలు కానీ ఏ ఇతర మాంసం తిన్నా ఆంజనేయస్వామి మీపై తీవ్ర ఆవేదన చెందుతారని భక్తులు నమ్ముతారు. ఇలా ఈయన కోపం చెందడం ద్వారా మీకు ఆర్ధికంగా కష్టాలు మరింత పెరుగుతాయని చెబుతుంటారు. అలాగే ఆంజనేయస్వామిని విశ్వాసంగా కొలిచే వారికి ధైర్యం ఎక్కువ ఉంటుంది. ఇలాంటి వారు ఎటువంటి సమస్య వచ్చినా ఎంతో ధైర్యంగా ఆత్మవిశ్వాసంతో ఎదుర్కొని విజయాన్ని సాధిస్తారని పూర్వీకులు పురాణాలలో చెప్పి ఉన్నారు. కాబట్టి పైన తెలిపిన విష్యాలన్నీ సాధ్యపడాలంటే ఖచ్చితంగా మంగళవారం నాడు మాంసం జోలికి వెళ్లకుండా ఉండాలి.