
ఈ పూజ గది నిర్మించే విషయంలో కొన్ని కీలక విషయాలను వాస్తు శాస్త్ర పండితులు చెబుతున్నారు. ముఖ్యముగా పూజాగదికి ఏ కలర్ పెయింట్ వేయాలో అన్నది చాలా కీలకం అన్నది వారి అభిప్రాయం. దీనిని బట్టి ఆ ఇంటికి తగిన ఫలాలు లభిస్తాయని పండితులు చెబుతున్న మాట. పూజ గది మన ఇంట్లో ఉత్తరం దిక్కు, తూర్పు దిక్కు లేదా ఈశాన్య దిక్కులోనే ఉండాలి. అప్పుడే ఆ ఇంట్లో వారు పూజలు చేస్తే వారికి ఆనందం, సౌభాగ్యం, సంతృప్తి అన్నీ ఉంటాయని పండితులు చెబుతున్నారు. అంతే కాకుండా పూజ గదికి, వంట గది మరియు బాత్రూం దోరగా ఉండేలా చూసుకోవాలి.
మాములుగా మనము చూసినంత వరకు పూజ గదులకు ఆరెంజ్ లేదా పసుపు రంగు వేసుకుంటారు. ఈ రెండు రంగులను వాస్తు శాస్త్రవేత్తలు సూచించేవారు. ఈ రంగుల వలన ఇంటిలో వారికి మంచి ఆరోగ్యం మరియు బాధ్యతాయుతమైన వ్యవహార శైలి ఏర్పడుతుందట. అలాగే తెలివితేటలు పెరుగుతాయి. మానసికంగా ఎంతో ధృడంగా ఉంటారు. కాబట్టి... మీ ఇంట్లో పూజ గదికి ఈ రెండు రంగుల్లో ఏదో ఒకటి వేసుకోమని వాస్తు శాస్త నిపుణులు చెబుతున్నారు. అవి కాదంటే... వైట్ కలర్ పెయింట్ వేసుకున్నా పర్వాలేదని చెబుతున్నారు. పూజ గదిలో వాడే వస్తువుల రంగులు కూడా మనపై ప్రభావం చూపుతాయట. పూజ గదిలో వీలైనంతవరకూ ఎక్కువ వస్తువులు ఉంచవద్దని చెబుతున్నారు.