
ధ్యాయేత్ ఇక్సిత సిద్ధయే అన్నారు. ధ్యానం చేస్తే కోరికలు తీరతాయి. జ్యోతిర్ముఖ దర్శనం అనేది మహాశివరాత్రినాడు ధ్యానంనందు చేయాలి. జ్యోతిర్లాంగాన్ని రాత్రి 12.00 గంటలకు దర్శనం చేసుకుంటారు. వివిధ కారణాలవల్ల జాగరణ చేయనివారు ఈ శ్లోకం చెబితే పరమశివుడు శివ సాయుజ్యాన్ని ప్రసాదిస్తాడు.
కీటాఃపతంగాహ మశకాశ్చ వృక్షాహ
జలేస్తలేహి నివసంతి జీవాః
దుష్ట్వా ప్రదీపం నచ జన్మ భాగినః
భవంతిత్వం స్వభిచాభి స్వపచాహి విప్రాహ
ఎవరైతే జ్యోతిర్లింగ దీపాన్ని చూసి నమస్కరించి ఈ శ్లోకాన్ని చెబుతున్నారో వారికిక జన్మలేదు అని పరమశివుడు నిర్ధేశించాడు. ఆ భక్తితో కూడిన దర్శనంవల్ల జ్ఞానం కలిగి అజ్ఞానంతో వచ్చే జన్మ పరంపర నుంచి తప్పించుకోవచ్చు. జ్యోతిర్లింగాన్ని దర్శించి పైన చెప్పిన మంత్రం చదువుకున్నప్పుడు మనకు మోక్షం కలుగుతుంది. కానీ నాలుగుకాళ్ల జంతువులు కూడా మనతోపాటు ఉన్నాయికాబట్టి ఆ వెలుతురు పడినంతమేర అక్కడ ఏయే జీవరాశి ఉంటుందో ఆ జీవరాశికి ఉత్తమ జన్మ ప్రాప్తిస్తుంది.
ఎవరు ఈ దీపం చూస్తున్నారో.. ఈ కాంతి ఎంత దూరం పడుతుందో అంతమేర ఉండే పురుగులు, రెక్కలతో ఎగిరే పక్షులు, ఈగలు, దోమలు, పక్షులు, చెట్లు, కాంతికి సమీపంలో నీరున్నప్పుడు ఆ నీటిలో నివసించే కొన్ని జీవులు, జ్యోతిని చూసి శ్లోకం చెప్పేవారి కంఠధ్వని ఎంత దూరం వెళుతుంతోవారికింక మరు జన్మలేదు. ఎవరైతే ఆ దీపాన్నిచూసి చెబుతున్నారో వారికి శాశ్వత శివ సాయుజ్యాన్ని ప్రసాదిస్తాడు పరమ శివుడు.
ప్రతిరోజూ చీకటి పడిన తర్వాత మనల్ని ఆవహించే రాక్షస ప్రవృత్తి కామ, క్రోధ, లోభ, మోహ మద, మాత్సర్యాలు మనసును పట్టకుండా ఈశ్వరాభిముఖం పట్టాలి. మనసు నిలబెట్టాలంటే శరీరం సహకరించాలి. అత్యంత ముఖ్యమైన విషయాన్ని భగవంతునికి సంబంధించినదిగా మార్చాలి. అప్పుడు ఆ భగవంతుడు తృప్తి చెంది మన కోరికల్ని తీరుస్తాడు.