మహాయుద్దం ముగిసిన తర్వాత వింటి మీద తల ఆన్చి నిద్రిస్తున్న శ్రీమహావిష్ణువును ఎలా నిద్రలేపాలో తెలియలేదు. లేపితే కలిగే నిద్రభంగపాపము, లేపకపోతే దేవతలకి అరిష్టం. అయినా శ్రీ మహాలక్ష్మీదేవి ఎంత నష్టం జరిగినా పరవాలేదనుకుంది. శ్రీ మహావిష్ణువును నిద్రలేపి ఆ దోషాన్ని మాత్రం పొందకూడదనుకుంది. ఈ పాపానికి దేవతలే భయం చెందుతారు. నిద్రాభంగముతోపాటు కథాభంగము, దాంపత్య భంగము, తల్లీ బిడ్డను విడదీయటం వంటివి కూడా మహాపాతకాలు, పాపమంటే పుణ్యం ద్వారా పోగొట్టుకోవచ్చు. పాతకమంటే అనుభవించాల్సిందే. వేరే దారి లేదు.  

మరింత సమాచారం తెలుసుకోండి: