తులసీ పత్రాలను దేవతార్చనలో వాడతారు. ఈ పత్రి తులసీ వృక్షానికి చెందినది. వినాయక చవితి రోజు చేసుకునే వరసిద్ధి వినాయక ఏకవింశతి పత్రి పూజా క్రమములో ఈ ఆకు ఏడవది. ఇంట్లో పూజించుకునే తులసి మొక్క రంగు లో కొన్ని సార్లు మార్పులు చోటు చేసుకుంటాయి. మరి కొన్ని సార్లు రాలిపోవడమో...మారిన రంగును బట్టి లేదా ఆకురాలేదాన్ని బట్టి అది ఆ కుటుంబంలో ఎటువంటి పరిణామాలకు దారి తీస్తుందో చెప్పవచ్చు. ఇప్పుడు అవి ఏంటో తెలుసుకుందాం.
1. తులసి చెట్టు ఎప్పుడూ పచ్చగా ఉంటే... ఇంట్లో ఆనందం, సంతోషం మన వెంటే ఉంటాయి. ఇంట్లో వారికి ఎలాంటి సమస్యలు కలుగకుండా ఉంటాయి.
2. పచ్చగా కళకళలాడుతున్న తులసి చెట్టు ఆకులు అకస్మాత్తుగా ఎండిపోతే.... ఆ ఇంటి యజమానికి ఆరోగ్య పరంగా ఏదైనా సమస్యలు తలెత్తుతాయని అర్థం.
3.ఒకవేళ నీళ్ళు పోయకున్నా తులసి మొక్క బాగా పచ్చగా, ఏపుగా పెరుగుతుంటే... ఇంట్లో వారికి అదృష్టం కలిసి వస్తుందని సూచన...
4 . చెట్టు ఆకులు సడన్‌గా వేరే రంగుకు మారితే... ఇంట్లో ఉన్నవారు క్షుద్ర శక్తుల బారిన పడనున్నారని అర్థం.
కాబట్టి ఇవి అన్నీ కూడా శాస్త్రాల ప్రకారం పండితులు చెబుతున్న మాటలు. వీటన్నింటినీ తెలుసుకుని భయపడాలిసిన అవసరం లేదు. ఎవరి నమ్మకం వారిది. మీ నమ్మకం ప్రకారం నడుచుకోండి అంతా శుభమే జరుగుతుంది.