జీవితంలో ఎన్ని సమస్యలు ఎదురైనా వాటిని చిరుమందహాసంతో ఎదుర్కొని పారద్రోలి గొప్ప జీవిత సత్యాన్ని భోదపరిచారు. మధురానగరంలో కంసుని చెరసాలలో జన్మించిన కృష్ణుడు పుట్టగానే తన తండ్రి వసుదేవునిచే రేపల్లెలోని నందుని ఇంట చేరి యశోదాదేవి ముద్దు బిడ్డగా బాల్య జీవితము గడిపాడు. శ్రీ మహా విష్ణువు జన్మించిన సమయంలో కొన్ని ప్రత్యేక ఘటనలు జరిగాయి. అవేమిటో వాటి విశిష్టత ఏమిటో ఇపుడు తెలుసుకుందాం. చెరసాలలో కన్నయ్య జన్మించగానే కంసుడు నుండి కాపాడడానికి అక్కడ నుండి శ్రీకృష్ణుని బుట్టలో పెట్టుకుని బయటికి వెళ్లడానికి వస్తాడు వాసుదేవుడు. ఆ సమయంలో జైలులో ఉన్న వారందరూ యోగమాయ ప్రభావం వల్ల గాడ నిద్ర లోకి వెళ్లి పోతారు. అంతేకాకుండా జైలు తలుపులు వాటికవే తెరుచుకుంటాయి.
ఆ సమయంలో వర్షం కుండపోతగా కురుస్తూ ఉంటుంది. నదులు వాగులు వంకలు పొంగిపొర్లుతుంటాయి. బుట్టలో కృష్ణుని పెట్టుకుని వాసుదేవుడు యమునా నది దాటే సమయంలో... శ్రీ కృష్ణుని చిన్ని పాదాల స్పర్శతో ఆ నది రెండుగా విడిపోయి మార్గాన్ని ఏర్పరుస్తుంది. ఆ జడివాన లోనే మధుర నుండి రేపల్లె లో నివసిస్తున్నటువంటి నందుడి ఇంటి వద్దకు తీసుకెళ్తాడు వాసుదేవుడు. అలా నందుడు ఇంటికి చేరి యశోధ దేవి జన్మనిచ్చిన పాప స్థానంలో శ్రీకృష్ణుని పెట్టి ఆ పాపను తనతో తీసుకు వెళ్తాడు వాసుదేవుడు. ఈ విషయం నందుడికి కూడా తెలుసు. అయితే ఘటన తర్వాత యోగమాయ ప్రభావం వలన వీరు ఆ విషయాన్ని మర్చిపోతారు.
శ్రీకృష్ణుని అక్కడ విడిచిపెట్టి యశోద దేవి పాపతో జైలుకు చేరుకుంటాడు వాసుదేవుడు. ఆ తర్వాత అందరూ మత్తులో నుండి మేల్కొంటారు. దేవకి తన 8వ సంతానానికి జన్మనిచ్చిన అని తెలుసుకున్న కంసుడు హుటాహుటిన జైలుకు వచ్చి ఆ పాపను తీసుకుని అంతం చేయాలని చూడగా.... ఆ పాప కంసుని చేతి నుండి పైకి ఎగిరి దేవతా మూర్తిగా మారి కంసుడి మరణం గురించి చెప్పి తన ఆగ్రహాన్ని వ్యక్తపరచి మాయమవుతుంది. ఆ తర్వాత ఆమె వింధ్యాచల పర్వతంపై దేవతగా నెలకొంది. ఆమెనే వింధ్యాచల దేవిగా భక్తులు పూజిస్తారు. ఇలా శ్రీకృష్ణుడు జన్మించిన సమయంలో అనేక అద్భుత ఘట్టాలు చోటుచేసుకున్నాయి. అంతేకాక ఇక అప్పటినుండి సమస్యల ఎదురవుతున్న ప్రతిసారి ఎన్నో వింతలు చేసి వాటిని ఎదుర్కొన్నాడు ఆ కృష్ణుడు.