
ఇలా చేయడం వల్ల సముద్రుడు మన పాపాలన్నిటిని కడిగి తిరిగి మనకు సంతోషకరమైన జీవితం ఇస్తాడన్నది ఒక నమ్మకం. ఇకపోతే సంక్రాంతుల్లో సముద్ర స్నానం తప్పకుండ చేయాలి. తద్వారా మనకు మంచి ఫలితాలు వస్తాయి. అదే విధంగా సముద్ర స్నానం చేసే సమయంలో ప్రమాదాల భారిన పడకుండా జాగ్రత్తలు వహించాలి. సముద్ర అలలకు ఎదురు వెళ్లడం సముద్రుడిని ధిక్కరించినట్లు అవుతుంది, అంతే కాక భయం భక్తి లేకుండా మరీ లోతు ప్రదేశంలోకి వెళ్ళరాదు,
అష్టమి, దశమి, నవమి దినాలలో సముద్ర స్నానం చేస్తే ధన ధాన్యము మనల్ని వరిస్తాయని ఒక నమ్మకం. సముద్ర స్నానం చేయడం ఎంతో పుణ్యము. రాత్రి తొమ్మిది తర్వాత సముద్ర స్నానం నిషేదం. ఈ సమయంలో చేయరాదు. అమావాస్య నాడు చేసే సముద్ర స్నానం విశేష ఫలాన్ని ఇస్తుంది. ఇలా ప్రత్యేక దినాలలో సముద్రస్నానం పుణ్యాన్ని ఇఛ్చి మన జీవితం సుఖ సంతోషాలతో నిండేందుకు ఆశీర్వాదాన్ని ఇస్తాడు సముద్రుడు. కావున ఈ విశేష రోజులలో సముద్రస్నానం చేయడం మంచి ఫలితాలను ఇస్తుంది.