ఉగాది పండగను తెలుగు సంవత్సరాది అంటారని మన అందరికి తెలిసిన విషయమే. అసలు మనం ఉగాది పండగను ఎందుకు జరుపుకుంటాము. ఉగాది పండగకి ఎందుకు అంత ప్రాముఖ్యతను ఇస్తారో ఒక్కసారి చూద్దామా. అయితే చైత్రశుద్ధ పాడ్యమి రోజున బ్రహ్మ సృష్టిని ఆరంభించాడు. అందుకే మనం ఆ రోజున యుగాది జరుపుకుంటాం. ఇక ఆరోజు నుండే ఈ సృష్టి ప్రారంభమయ్యిందని మన పూర్వీకులు చెబుతూ ఉండేవారు. అందుకే ఈ చైత్ర శుక్ల పాడ్యమి పర్వదినాన్ని ఉగాదిగా జరుపుకుంటారని చెబుతుంటారు.

అంతేకాదు.. వేదాలను హారించాడని సోమకుని వధించేందుకు విష్ణువు మత్య్సవతారం ఎత్తుతాడు. ఇక విష్ణువు మత్య్సవతారంలో వచ్చి అతడిని చంపేస్తాడు. విష్ణువు ఆ తర్వాత ఆ వేదాలను తీసుకోని వచ్చి బ్రహ్మదేవుడికి అప్పగిస్తాడు. ఇక ఆరోజు నుంచే ఉగాది జరుపుకోవడం ప్రారంభమైందని చెబుతుంటారు. ఇక ముఖ్యంగా చైత్ర శుద్ధ పాడ్యమి రోజున సూర్యోదయ సమయంలో బ్రహ్మదేవుడు సృష్టిని చెబుతుంటారు. అలాగే ఉగాది నుంచే వసంత రుతువు కూడా ప్రారంభమవుతుంది. ఈ కథతో పాటు మరో స్టోరీ కూడా పురణాల్లో ఉంది.

ఇక శాలివాహన చక్రవర్తి చైత్ర శుక్లపాడ్యమి రోజే పట్టాభిషిక్తుడయ్యాడని చెబుతుంటారు. ఇక ఆరోజునే ఉగాదిని జరుపుకోవడం ఆనవాయితిగా వచ్చిందని చెబుతుంటారు. “ఉగ” అంటే నక్షత్ర గమనం జన్మ ఆయుష్షు అని అర్థాలు వస్తాయి. అలాగే యుగం అంటే ద్వయం లేదా జంట అంటారు. ఉత్తారయణ, దక్షిణాయణ ద్వయ సంయుతం యుగం అంటారు. ఆ యుగానికి ఆది యుగాదిగా మారిదంని.. ఉగాది శబ్దానికి ప్రతిరూపంగానే ఈ ఉగాది రూపొందిందని అంటుంటారు. ఇక పండుగను కేవలం తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా.. దేశంలోని వివిధ రాష్ట్రాల్లో వివిధ పేర్లతో జరుపుకుంటారు. మహారాష్ట్రలో ఉగాదిని గుడిపడ్వాగా జరుపుకుంటారు. తమిళులు పుత్తాండు అని, మలయాళీలు విషు అని, సిక్కులు వైశాఖీ అని, బెంగాలీలు పోయ్ లా బైశాఖ్ అనే పేర్లతో ఉగాదిని జరుపుకుంటారు.

మరింత సమాచారం తెలుసుకోండి: