జ్యోతిష్యం అనేది మనిషి జీవితానికి...ముఖ్యంగా భవిష్యత్తుకి సంబంధించినది. నక్షత్రాలు, చంద్రుడు, గ్రహాలు భూమి మీద ఉన్న ప్రజల జీవితాలపై ప్రభావం చూపిస్తాయనే నమ్మకం మీద జ్యోతిష్యం ఆధారపడి ఉంది. ముఖ్యంగా హిందువులు జాతకాలను బాగా విశ్వసిస్తారు. ప్రధానంగా పెళ్లి సమయాలలో జాతకాలను సరి చూస్తారు.పెళ్ళి కొడుకు పెళ్ళికూతురు ల జాతకాలు ఎంత వరకు కలిశాయి అన్నది తెలుసుకొని మరి వారికి పెళ్లి తంతు చేస్తారు. కొందరు వారికి జాతకాలు కలవక పోతే కొన్ని శాంతి పూజలు జరిపించి వధూవరులకు  వివాహం జరిపిస్తారు. మరి కొందరు ఒక వేళ జాతకాలు కలవక పోతే అసలు వారికి పెళ్లే చేయరు. ఇలా మన జీవితంలో ఎన్నో విషయాలు జాతకంతో ముడిపడి ఉంటాయి.

మనిషి పుట్టిన సమయాన్ని  బట్టి ఆ సమయంలో గ్రహ, నక్షత్రాల  స్థానాన్ని బట్టి ఆ వ్యక్తి యొక్క జాతకం రాయబడుతుంది. ఆ వ్యక్తి భవిష్యత్తుకు సంభందించిన అన్ని విషయాలు ఆ జాతకంపై ఆధారపడి ఉంటుందన్నది ఒక నమ్మకం. అయితే ఇది ఎంత వరకు నిజం జాతకాలు మనిషి యొక్క భవిష్యత్తును ఎంత వరకు చెప్పగలుగుతాయి  అంటే జాతకాలు అన్నవి నిజమనే చెప్పాలి. ఇవి మనిషి జీవితంపై ప్రభావం చూపుతాయి అని చెప్పలేము కానీ... మనిషి యొక్క భవిష్యత్తును అంచనా వేసేందుకు ఉపయోగపడతాయి. నక్షత్రాలు, చంద్రుడు, గ్రహాలు భూమి మీద ఉన్న ప్రజల జీవితాలపై ప్రభావం చూపిస్తాయనే నమ్మకం మీద జ్యోతిష్యం ఆధారపడి ఉంది.

నక్షత్రాలు, చంద్రుడు, గ్రహాలు భూమి మీద ఉన్న ప్రజల జీవితాలపై ప్రభావం చూపిస్తాయనే నమ్మకం మీద జ్యోతిష్యం ఆధారపడి ఉంది. అందరూ జాతకం, జ్యోతిష్యం అనేటటువంటి వాటిని నమ్మక పోవచ్చు కానీ అవి మన జీవిత స్థితిగతులను అంచనా వేస్తాయన్నది మన పూర్వీకుల నుండి వస్తున్న నమ్మకం. అంతే కాక వేద పండితులు నమ్మిన శాస్త్రం.

మరింత సమాచారం తెలుసుకోండి: