అలాగే అక్షయ తృతీయ నాడు ఏదైనా వ్యాపారం లేదా పని ప్రారంభించినా అది నిరంతరాయంగా కొనసాగుతూ లాభదాయకంగా ఉంటుందంటారు. అలాగే అక్షయ తృతీయ నాడు నూతన వాహనాలు కొన్నా మంచిదని తెలుస్తోంది. అదే విధంగా ఇదే రోజున దానం చేసినా కూడా కోటి పూజలు చేసిన పుణ్యం లభిస్తుందని వేద పండితులు చెబుతున్నారు.
ఇక అక్షయ తృతీయ నాడు మనం శ్రీ మహాలక్ష్మి పూజ చేసే సమయంలో కింది మంత్రాలను పఠించడం ద్వారా పూజ ఫలితం మరింత పెరుగుతుందని, శ్రీ మహాలక్ష్మి అనుగ్రహం మీ కుటుంబంపై తప్పకుండా ఉండి మీ ఇల్లు సుఖ సంతోషాలతో, సిరి సంపదలతో వెలిగిపోతుందని అంటున్నారు. ఇప్పుడు ఆ రెండు మంత్రాలను గురించి తెలుసుకుందాం.
ఓం శ్రీం హ్రీం ఐం కుభేర లక్ష్మీ కమలధారిణ్యై,
‘ఓం హ్రీం శ్రీం క్రీం కుబేరాయ అష్టలక్ష్మీ మమ గ్రిహి ధనం పూరయ పూరయ నమః' మంత్రాన్ని పఠించాలి.
అదే విధంగా....
ఆద్యంతరహితే దేవి ఆదిశక్తి మహేశ్వరి
యోగజ్ఞే యోగసంభూతే మహాలక్ష్మీ నమోస్తుతే..!!
పై మంత్రాలను ఎంతో నిష్ఠగా పఠిస్తే ఆ శ్రీమహాలక్ష్మి అనుగ్రహాం మీపై ఉంటుంది.