ప్రపంచవ్యాప్తంగా ముస్లింలు ఎంతో ప్రీతి ప్రాయంగా జరుపుకునే అతిపెద్ద పండుగ రంజాన్.. రకరకాల పేర్లతో పిలిచే ఈ రంజాన్ ను ఈద్-ఉల్-ఫితర్ పండుగగా జరుపుకుంటారు.. రంజాన్ మాసం చివర్లో ఈద్-ఉల్-ఫితర్ ను జరుపుకుంటారు.. ఈ నెలంతా ముస్లింలు ఉపవాసాలు, ప్రార్థనలు చేస్తారు.. ఈద్-ఉల్-ఫితర్ అంటే ఉపవాసాలు ముగించడం అని అర్థం.. నెలవంకను చూడడంతో ఈద్ మొదలవుతుంది..

ముస్లింలు మసీదుల్లో లో జరిగే ఈద్ ప్రార్థనలకు హాజరవుతూ ఈ పండుగను ఎంతో ఘనంగా జరుపుకుంటూ ఉంటారు.. పశ్చిమాసియా దేశాల్లో అయితే ఉదయం నిర్వహించే ఫజర్ ప్రార్థనల తర్వాత వీటిని నిర్వహిస్తారు.. మసీదుకు కొత్తబట్టలు ధరించి వెళ్లడం ఈ పండుగ సాంప్రదాయం.. ఖర్జూరం లాంటి ఏదైనా తీయనిది తిన్న తర్వాత తగ్భిర్ అనే చిన్న ప్రార్థన చేస్తారు..

చంద్రమానం ప్రకారం 12 నెలల క్యాలెండర్ లు ఇస్లామిక్ క్యాలెండర్ అనుసరిస్తుంది.. ఇందులో 9వ నెల రంజాన్ పదో నెల షవ్వల్.. మొదట్లో ఈద్ ను జరుపుకుంటారు.. నెలవంక దర్శనంతో నే ప్రతి నెలా మొదలవుతుంది.. ఇది ఇది 29 నుంచి 30 రోజులు వరకు ఉంటుంది.. గతంలో దీన్ని మామూలు కంటితో నేరుగా చూసి నిర్ణయించే వారు.. అయితే ఇటీవల కాలంలో దీన్ని గుర్తించేందుకు టెలిస్కోపులు, సాంకేతికతను వాడుతున్నారు.. ఇండోనేషియా నుంచి మొరాకో వరకు భౌగోళికంగా చాలా విస్తీర్ణంలో ముస్లిం దేశాలు ఉన్నాయి.. అంటే నెలవంక ఒక్కో దేశంలో ఒక్కో సమయంలో కనిపించే అవకాశం ఉంది..

అందుకే కొన్ని ప్రాంతాల్లో రంజాన్ పండుగను ఒకే సమయంలో జరుపుకోరు..ప్రస్తుతం కోవిడ్ మహమ్మారి వ్యాధి వచ్చిన తరువాత రంజాన్ పండుగ ఈ ఏడాది కొంత భిన్నంగా జరగబోతుంది .. చాలా మంది తమ సంప్రదాయానికి విరుద్ధంగా ఈ పండుగ జరుపుకుంటూ ఉన్నారు.. గతంలో స్నేహితులు బంధువులతో కలిసి ఇఫ్తార్ విందు లో పాల్గొనేవారు.. కానీ ఇప్పుడు ఈ మహమ్మారి విస్తరిస్తున్న నేపథ్యంలో కోవిడ్ నిబంధనలకు ఎలాంటి ఆటంకం కలగకుండా ఈ పండుగను జరుపుకుంటున్నారు..




మరింత సమాచారం తెలుసుకోండి: