పండుగ రోజు ఉదయాన్నే నిద్రలేచి స్నానాలు ముగించుకొని ఫజర్ నమాజు చేయాలి. ఉన్నంతలో మంచి దుస్తులు ధరించి, అత్తరు లాంటి సువాసన ద్రవ్యాలను వినియోగించాలి. ఈద్గాలో సమావేశమై సామూహికంగా దైవానికి కృతజ్ఞతా స్తోత్రాలు చెల్లిస్తూ ఈద్ నమాజ్ చేయాలి. కరోనా కారణంగా ఈసారి ఈద్ గాహ్‌లలో కాకుండా మసీదులలోనే మాస్క్ ధరించి, భౌతికదూరం పాటిస్తూ నమాజు ఆచరించవలసి ఉంది. వ్యాధుల బారినుండి, అప్పుల బారినుండి, శత్రువుల బారినుండి, కరువుకాటకాల నుండి, దారిద్య్రం నుండి తమను, దేశాన్ని, యావత్ భూప్రపంచాన్ని రక్షించమని, ముఖ్యంగా కరోనా మహమ్మారి నుండి మానవాళినంతటినీ కాపాడమని విశ్వప్రభువును వేడుకోవడం సంతరించుకుంటుంది. ‘ఈద్ ముబారక్’ అంటూ తమతోటివారికి శుభాకాంక్షలు తెలుపుకోవాలి. పండుగ పరమార్థాన్ని అవగాహన చేసుకుంటే రమజాన్ ఆరాధనల ఆశయం నెరవేరుతుంది. తెలుగు రాష్ట్ర ప్రజలందరికీ రంజాన్ పండుగ శభాకాంక్షలు..