హిందూ మతంలో గరుడ పురాణం అనే గ్రంథానికి ఎంతో ప్రత్యేకమైన స్థానం ఉంది. మరణం, ధర్మం, కర్మ, భక్తికి సంబంధించిన విషయాల గురించి ఎన్నో రహస్య విషయాలను విష్ణుమూర్తి తన వాహనమైన గరుడుకి బోధించాడు. అవన్నీ గరుడ పురాణం అనే గ్రంధంలో నిక్షిప్తమై ఉన్నాయి. ఈ విషయాలన్నిటినీ గరుడ పురాణం పూర్తిగా వివరిస్తుంది. అయితే ఇందులో మానవుడు చేయకూడని ఐదు పనులను గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

* గర్భంలో ఉన్న పిండానికి హాని చేసినా లేదా చంపినా వారు మహా పాప గ్రస్తులు అవుతారు. గర్భంతో ఉన్న స్త్రీకి హాని చేయదలచిన వారు నేరుగా నరకానికి వెళతారు.

* ఎవరైతే తమ దగ్గర ఉన్న సంపదను చూసి ఎక్కువ గర్వపడుతూ లేని వారిని చూసి కించపరుస్తారో , నిస్సహాయులపై తమ అజమాయిషీ చెలాయిస్తారో అటువంటి వారి పాపం పండి తమ ఐశ్వర్యాన్ని కోల్పోయి అదఃపాతాలానికి పడిపోతారని గరుడ పురాణంలో చెప్పబడింది. అంతే కాదు వీరికి నరకంలో పలు కఠినమైన శిక్షలు అమలు చేయబడతాయి అని చెప్పబడింది.

* హిందువు అయ్యుండి కూడా   ఎవరైతే దేవుణ్ని విశ్వసించరో, పూజించడానికి బదులుగా దేవుని ఎప్పుడు నిందిస్తూ ఉంటారో అటువంటి వారు తమ జీవితంలో సుఖసంతోషాలను కోల్పోతారు, ఒంటరిగా మిగిలి కృంగిపోతారు అని చెప్పబడింది.

* గరుడ పురాణం ప్రకారం ఎవరైతే మాసిన బట్టలను ధరిస్తారో వారు కష్టాలను ఎదుర్కొంటారు. సమస్యలలో చిక్కుకుంటారు. మాసిన బట్టలను  వేసుకునేవారు లక్ష్మీ కటాక్షాన్ని పొందలేరు అని చెప్పబడింది. పాత బట్టలు అయినా సరే శుభ్రం చేసుకొని మాత్రమే ధరించాలి.

* కష్టాల్లో ఉన్న వారిని చూసి నవ్వ కూడదు, అభాగ్యులు సాయం కోరి వస్తే మీరు సాయం అందించగలిగే   పరిస్థితిలో ఉండి కూడా సహాయ పడకపోతే అలాంటి వ్యక్తి వద్ద ధనలక్ష్మి నిలవదని, వారి జీవితం కష్టాల మయం అవుతుందని గరుడ పురాణం వివరిస్తోంది.


మరింత సమాచారం తెలుసుకోండి: