కలలు అనేవి మన భవిష్యత్తుకు ప్రతీకలని, జరగబోయే విషయాలను సూచించే వని మన శాస్త్రాలలో చెప్పబడింది. కేవలం భవిష్యత్తుకు మాత్రమే కాకుండా, గతానికి మన వర్తమానానికి కూడా కలలు సంకేతాలని చెప్పబడింది. అయితే కలలలో చాలా రకమైన సంఘటనలు కనిపిస్తూ ఉంటాయి. అయితే మన శాస్త్రాలలో ఒక్కో దానికి ఒక్కో అర్థం చెప్పబడింది. కళ ఏదైనా అది వచ్చే రూపాన్ని బట్టి దాన్ని విశ్లేషించడం జరిగింది. కలలో పండ్లు కనిపిస్తే చాలా మంచిదని, డబ్బు కనిపిస్తే అనర్థం అని ఇలా ఎన్నో ఉన్నాయి.
అయితే కలలో పిల్లి కనిపిస్తే అది దేనికి సంకేతం అనేది ఇప్పుడు తెలుసుకుందాం. మనం ఏదో పెద్ద సమస్యలు పడబోతున్నామని అర్థం అదే నల్ల పిల్లి కనుక కనిపిస్తే సమస్య ఎదురైనప్పటికీ దానిని చేదిస్తామని అర్థం.

అదే పిల్లి తన పిల్లలకు పాలు ఇస్తున్నట్లు కనిపిస్తే మనకు ధన లాభం ఉందని అర్థం. మనలోని పిరికితనాన్ని, భయాన్ని మనకున్న కష్ట నష్టాలను త్వరలోనే పోగొట్టే సమయం రాబోతుందని ప్రతీక అని చెప్పబడింది. మీతో ఎంతో సన్నిహితంగా ఉండే వారే మిమ్మల్ని మోసం చేయబోతున్నట్లు సూచన, చనిపోయిన పిల్లి కనుక కలలో కనిపించినట్లైతే, మీరు మీ జీవితం లో ఉన్నటువంటి పెద్ద సమస్యల నుండి అతి త్వరలోనే బయటపడబోతున్నట్లు సూచన.

ఒకవేళ మన కలలో కనుక పిల్లి వేటాడుతున్నట్లు కనిపిస్తే రానున్న రోజుల్లో మీకు లాభం రాబోతున్నట్లు ప్రతీక. మీ శత్రువుల నుండి కూడా మీకు మేలు జరగబోతోందని సూచన. చెడ్డ కలలు కనుక వచ్చినట్లయితే వాటిని ఖచ్చితంగా ఇతరులతో పంచుకోవాలి. అప్పుడే ఆ చెడు కలలు యొక్క ప్రభావం మీపై తగ్గుతుంది అని శాస్త్రం చెబుతోంది. కలలు మన భవిష్యత్తులో జరగబోయే విషయాలకు ప్రతీకలని ఎవరైతే నమ్ముతారో వారు పై చెప్పబడిన అంశాలను గుర్తుంచుకోండి. ఇవి శాస్త్రాలకు అనుగుణంగా మాత్రమే చెప్పబడినది. కావున మీ నమ్మకాన్ని బట్టి నడుచుకోండి.

మరింత సమాచారం తెలుసుకోండి: