ఇంకో విషయం ఏమిటంటే, అన్ని ఇళ్ళల్లోనూ వంట గది, లేదా వంట చేసేందుకు కాస్త చోటు ఉంటుంది. వంటింట్లో మన ప్రాణాన్ని నిలిపే ఆహారాన్ని వండుతాము. వంటింట్లో లక్ష్మీదేవి కొలువై ఉంటుందని శాస్త్రాలు చెబుతున్నాయి. కాబట్టి పనంతా అయిపోయిన తర్వాత సాయంత్రం నిద్ర పోయే ముందు వంట గదిని ఖచ్చితంగా శుభ్రపరుచుకోవాలి. అదే విధంగా వంట పాత్రలు కూడా యధా స్థానంలో వాటిని అమర్చుకోవాలి. అలా చేయకుండా ఎక్కడివక్కడే వదిలేసినట్లైతే మహాలక్ష్మికి ఆగ్రహం వచ్చి ఇంట్లో నుండి వెళ్ళిపోతుంది. అలాగే ఇంట్లో చీపురును దక్షిణ దిక్కున మాత్రమే ఉంచాలి. మరే దిక్కున పెట్టరాదు. అలా దక్షిణ దిక్కున ఉంచడం ద్వారా మహాలక్ష్మి మన ఇంటికి వస్తుంది.
అదే విధంగా సాయంత్రం సమయంలో ఇంట్లో నుండి చెత్తను బయట పడేయరాదు. చాలా మంది మహిళలు రాత్రి సమయంలో జుట్టుని విరబోసుకొని నిద్రపోతారు. కానీ ఇలా చేయడం ఎన్నో సమస్యలకు కారణం అవుతుంది. రాక్షసులు మాత్రమే ఇలా రాత్రి సమయంలో జుట్టుని విరబోసుకుంటారు. ఇలాంటి వారికి ధనలక్ష్మి అనుగ్రహం లభించదు. ఇక ఎంతో మంది రాత్రి సమయంలో తల దగ్గర అందుబాటులో మంచి నీటిని పెట్టుకుని పడుకుంటారు. అయితే ఇలా అస్సలు చేయరాదట దాహం వేస్తే లేచి తాగాలి తప్ప అలా తలవద్ద నీటిని పెట్టుకోరాదు. ఈ విషయాలను మహిళలు తప్పకుండా గుర్తుంచుకోవాలి.