మనకంటూ ఒక సొంత ఇల్లు ఉంటే దాని వల్ల కలిగే ఆనందం మరియు ధైర్యమే వేరు. భవిష్యత్తులో మనకంటూ ఒక అండ ఉందని , కష్ట నష్టాల సమయంలో మనకంటూ సొంత ఇల్లు ఉంటే తిన్నా లేకున్నా మన ఇంట్లో మనం ప్రశాంతంగా ఉండొచ్చని అనుకుంటుంటాం. చాలా మందికి సొంత ఇల్లు కట్టుకోవాలని ఎంతో ఆశగా ఉంటుంది. చాలా ఏళ్లుగా ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ ఏదో ఒక ఆటంకం ఎదురవడం వల్ల సొంత ఇల్లు కొనుక్కోవడం అనే కల వెనక్కి పోతూనే ఉంటుంది. ఎంతో కష్టపడి సొంత ఇంటి కల నెరవేరడం కోసం అలా నాలుగు రూపాయలు దాచి పెట్టుకున్నప్పటికీ ఇళ్ల రేట్లు పెరిగి పోవడం, మనకు నచ్చిన ఇల్లు అందుబాటు ధరలో లేకపోవడం ఇలా పలు రకాల సమస్యలు ఎదురవుతుంటాయి.
ఇంకొంతమందికి ఇల్లు కొనడం అనేది దాదాపుగా పూర్తి అయింది అనుకునే టప్పటికీ అమ్మే వాళ్ళు ఇల్లు మేము అమ్మమని చెప్పడమో, మనకి పూర్తి డబ్బులు కుదరకపోవడమో ఇలా ఏదో ఒక సమస్య వచ్చి చివరి దాకా వచ్చినా ఏదో ఒక ఆటంకంతో ఆగిపోతుంటుంది. అద్దె ఇళ్ళలో జీవనం గడుపుతూ సొంతింటి కోసం ఎదురు చూసే చాలా మందికి ఇలాంటి సమస్యలు ఎదురవుతుంటాయి అలాంటి వారు ఒక పరిహారం చేసినట్లయితే మీ సొంత ఇల్లు కల నెరవేరుతుందని చెబుతున్నారు జ్యోతిష్యులు. ఇంతకీ ఆ పరిహారం ఏమిటంటే... గృహానికి , రుణానికి అధిపతి అయినటువంటి అంగారకుడు. ఈయననే కుజుడు అని కూడా అంటుంటారు. అంగారకుడు మంగళవారానికి అధిపతి. ఎవరైతే అంగారకుడిని నిత్యము భక్తి శ్రద్ధలతో పూజిస్తుంటారో అటువంటి వారికి సొంత ఇంటి కల నెరవేరుతుందని పెద్దవాళ్లు చెబుతున్నారు.
ముఖ్యంగా కృష్ణంగారక చతుర్దశి కనుక మంగళవారం వచ్చినట్లయితే అది చాలా విశిష్ట మైనదిగా చెప్పబడుతోంది. కాబట్టి ఈ విశేషమైన రోజున కుజ వ్రతం చేసినట్లయితే మంచి ఫలితం లభిస్తుంది అని చెప్పబడుతోంది. లేదా వీటిని కూడా కుజుని పూజించడం వల్ల, కుజుని యొక్క అధిష్టాన దేవత అయినటువంటి సుబ్రహ్మణ్య స్వామిని పూజించడం వలన కూడా గృహయోగం కలుగుతుందని చెప్పబడింది. కాబట్టి పై విధంగా మీరు చేసినట్లయితే ఎన్నాళ్లగానో తీరని ఇంటి కొనుగోలు సమస్య తీరుతుందని శాస్త్రాలు చెబుతున్నాయి.
మరింత సమాచారం తెలుసుకోండి: