ఇక ఇంట్లో కనుక పదే పదే బల్లి కనిపిస్తే దానికి కూడా ఒక అర్థం ఉంది అంటున్నారు పండితులు. వాటి వైఖరిని బట్టి మనకు కొన్ని సంకేతాలు అందుతాయని వారు అంటున్నారు. రెండు బల్లులు కనుక ఇంట్లో పోట్లాడుకుంటూ కనిపిస్తే మనకు ఎంతో ఇష్టమైన వ్యక్తి నుండి విడిపోబోతున్నట్లు అర్థం. తద్వారా ముందుగానే ఈ విషయాన్ని అర్థం చేసుకొని అలాంటి సందర్భం వచ్చినప్పుడు మనమే సర్దుకుపోవడానికి ప్రయత్నం చెయ్యాలి. అలాగే బల్లి కనుక పదే పదే అరుస్తూ ఉంటే మీకు సమస్యలు పొంచి ఉన్నాయని అవి ముందుగానే మీకు సంకేతం అందిస్తాయి. ఇది మనం అర్థం చేసుకున్నట్లయితే రాబోయే సమస్యను ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండడమో లేదా సమస్యలు తలెత్తకుండా పరిస్థితులను అనుకూలంగా చేసుకోవడానికి అవకాశం ఉంటుంది.
అదే విధంగా ఒకవేళ గృహ ప్రవేశం సమయంలో చనిపోయిన బల్లి కనుక ఇంట్లో కనబడితే ఆ ఇల్లు మీకు పెద్దగా కలిసి రాదని, అలాగే మీరు అనారోగ్య సమస్యల పాలవుతారని అర్థం. కాబట్టి మీ ఇంట్లో తిరిగే బల్లులపై కూడా ఒక కన్ను వేసి ఉంచాలి. ఈ సమాచారం అంతా కూడా పండితులు అందించిన సంగీతం విషయాలను క్రోడీకరించి మీకు అందిస్తున్నాము. నమ్మాలా లేదా అన్నది పూర్తిగా మీ పైనే ఆధారపడి ఉంటుంది.