ప్రతి ఒక్క మనిషి పుట్టుక ఒక అద్భుతం. ఆ మనిషి జన్మించినటువంటి సమయం నక్షత్రం తిధులను బట్టి వారి భవిష్యత్తు నిర్ణయించబడి ఉంటుందని హిందువుల ప్రగాఢ విశ్వాసం. అందుకే శిశువు యొక్క భవిష్యత్తును తెలుసుకోవడం కోసం ఆ శిశువు జన్మించిన తరువాత తల్లిదండ్రులు పిల్లల యొక్క జన్మ వివరాలను పండితులకు ఇస్తారు. వారు వారి జాతక చక్రమును గణించి ఆ శిశువు యొక్క జాతకమును రాసి ఇస్తారు. ఇలా ఆశీస్సులు జన్మించినటువంటి సమయము, రోజు తిథి నక్షత్రాలు ప్రతిదీ వారి జాతకంలో ఎంతో కీలకం.
అయితే గురువారం నాడు జన్మించిన శిశువు యొక్క స్వభావాలు ఎలా ఉంటాయో పండిత మహాశయులు ఏమి చెబుతున్నారో చూద్దాం. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.
గురువారానికి అధిపతి గురువు కాబట్టి ఆ రోజు పుట్టిన శిశువులపై ఆయన ప్రభావం అధికంగా ఉంటుంది.


అందుకే గురువారం నాడు పుట్టిన శిశువులపై గురువు యొక్క ప్రభావం వలన వారు ఎక్కువగా శాంతి స్వభావం కలిగిన వారై  వుంటారు. వారిలో ఎక్కువగా సద్గుణాలు నిండి ఉంటాయి. గురువారం నాడు పుట్టిన వారు కొన్ని ప్రత్యేకమైన లక్షణాలు కలిగి ఉంటారు. వారు ఎల్లప్పుడూ మంచి పనులు చేయడమే కాకుండా తన తోటి వారితో కూడా మంచి పనులు చేయించేందుకు ప్రేరణ కలిగిస్తారు. గురువారం జన్మించినటువంటి శిశువుల కీర్తి ప్రతిష్టలకు ఏ విధమైన లోటుండదు. వారు అనుకున్న దాన్ని సాధించడం వీరిలో ఒక ప్రత్యేకమైన విషయం. అందుకే వీరు జీవితంలో గొప్ప గుర్తింపు అందుకుంటారు.

గురువారం పుట్టిన అటువంటి వారు తమ సంకల్పాన్ని ఆలస్యమైనా సరే చివరికి సాధించడంలో నిష్ణాతులై ఉంటారు. గురువారం పుట్టినటువంటి స్త్రీ పురుషులు ఎవరైనా సరే వారిలో ఎక్కువగా దైవభక్తి ఉంటుంది, అలాగే మనసు ఎప్పుడు ఆధ్యాత్మికం వైపు అడుగులు వేస్తుంది. అలాగే ఎవరైతే గురువారం నాడు జన్మిస్తారో అటువంటి వారు తమ మనసులోని సుఖదుఃఖాలను ఎవరితోనో పంచుకోవడానికి పెద్దగా ఇష్టపడరు. కానీ సహాయం చేసే గుణాలు చాలా ఎక్కువే. ఇలా ఎక్కువగా లక్షణాలను సుగుణాలను వీరు కలిగి ఉంటారు.

మరింత సమాచారం తెలుసుకోండి: