ఆగస్టు మాసానికి సంబంధించిన ఈ నెల 20వ తేదీన టీటీడీ ఆన్‌లైన్‌లో 1,35,000 టికెట్లను విడుదల చేయగా.. గంట వ్యవధిలోనే టికెట్లు అన్నీ అమ్ముడయ్యాయి. గతంలో ఎప్పుడు కూడా ఇలాంటి పరిస్ధితి లేదు. భక్తులు అత్యంత పవిత్రంగా భావించే వైకుంఠ ద్వార దర్శన సమయంలో కూడా ఇంతటి స్థాయిలో భక్తుల నుంచి డిమాండ్ ఉన్న పరిస్ధితి లేదు. గత ఏడాది వైకుంఠ ద్వార దర్శనం కోసం లక్ష టిక్కెట్లను ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉంచితే.. రెండు రోజులపాటు భక్తులకు టికెట్లు అందుబాటులో ఉన్నాయి. కానీ ప్రస్తుతం నెల రోజులకు సంబంధించిన టికెట్లను విడుదల చేసిన గంటలోనే భక్తులు వాటిని కొనుగోలు చేయడం.. స్వామివారి దర్శనం కోసం భక్తులు పడుతున్న తాపత్రయానికి నిదర్శనంగా నిలుస్తోంది. మొత్తంమీద మునుప్పెన్నడూ లేని విధంగా శ్రీవారి దర్శనానికి భక్తుల నుంచి అనూహ్యంగా డిమాండ్ నెలకొంది. అయితే టీటీడి మాత్రం స్వామివారి దర్శనాలు పెంచేందుకు నిరాకరిస్తోంది. థర్డ్ వేవ్ ముప్పు పొంచి ఉన్న నేపథ్యంలో దర్శనాల సంఖ్యను పెంచే అలోచన లేదని, ఇంకొంత కాలం యథాస్థితిని కొనసాగిస్తామని ఈవో జవహార్ రెడ్డి స్పష్టం చేశారు. దీంతో ఇంకా రెండు నుంచి మూడు నెలలపాటు శ్రీవారి దర్శనం కోసం భక్తులు నిరీక్షించాల్సిన పరిస్థితి ఏర్పడింది.