దేశంలోని శివాలయాలలో శ్రీకాళహస్తిలోని  శివాలయాన్ని అత్యంత ముఖ్యమైన పవిత్రమైన శివాలయంగా భావిస్తారు. ఇక్కడ గుడిలో ఉన్నటువంటి శివలింగానికి ప్రాణం ఉందని అందులో పరమేశ్వరుడు లీనం అయ్యారని ప్రగాఢ విశ్వాసం. ఈ దేవాలయం చిత్తూరు జిల్లాలోని స్వర్ణముఖి నది ఒడ్డున  శ్రీకాళహస్తి అనే పట్టణంలో కొలువై ఉంది ఉంది. ఇక్కడ దేవాలయంలోని శివలింగం ఎంత ప్రత్యేకమంటే దేశం మొత్తం మీద ఉన్నటువంటి అత్యంత ప్రాచీనమైన పంచభూత లింగాలలో ఉన్నటువంటి వాయులింగం ఇక్కడ కొలువుదీరి ఎంతో వైభవంగా నిత్యపూజలు అందుకుంటోంది. మన దేశ వాస్తు కలకు ఎంత ప్రాధాన్యం ఇస్తుందో ఈ దేవాలయ నిర్మింపబడినటువంటి శైలి  అద్దం పడుతుంది. ఈ ప్రాచీన శివాలయమును శ్రీకృష్ణదేవరాయల కాలంలో నిర్మించినట్లుగా ప్రతీతి.  ఇక్కడి  గాలిగోపురం ఎంతో ప్రత్యేకం. ఎక్కడ నుండి కూడిన ఎత్తైన శిఖరంలా కనిపిస్తుంది. ఇన్నేళ్ళు గడుస్తున్నా ఏమాత్రం చెక్కుచెదరకుండా దర్శనమిచ్చే వెయ్యి కాళ్ళ మండపాలు ఈ  శివాలయంలో ప్రధాన ఆకర్షణలు గా నిలుస్తాయి. 

శ్రీకాళహస్తిలో గర్భగుడిలో కొలువుదీరి ఉన్నటువంటి శివలింగము వెనుక ఎన్నో రహస్యములు  దాగి ఉన్నాయి. ఇక్కడ  శివలింగాన్ని భక్తులు ప్రాణం ఉన్నటువంటి లింగంగా  విశ్వసిస్తారు. గర్భగుడిలో  ఉన్నటువంటి శివలింగములో స్వయంగా ఆ శివుడు కొలువై ఉన్నారని అలా ఉండటం వెనుక పెద్ద కథే ఉందని అంటుంటారు.  అసలు ఈ శివలింగానికి ప్రాణం ఉందని భక్తులు ఎలా విశ్వసిస్తారు అనగా, ఇందులో  ఒక ప్రత్యేక కారణం కూడా ఉంది. ఇక్కడి గర్భగుడిలో ఉండే అన్ని దీపాలు మిగిలిన అన్ని దీపాలలాగే నూనె అయిపోయిన వెంటనే కొండెక్కుతాయి. కానీ శివలింగం ఎదురుగా ఉన్నటువంటి   అఖండ జ్యోతి మాత్రం నిరంతరం ఎంతో ప్రకాశంగా వెలుగుతూనే ఉంటుంది.

ఈ క్షేత్రంలో ఈ దీపం ఇప్పటి వరకు కొండ ఎక్కలేదట.  అందుకు కారణం శివలింగంలో శివుని ప్రాణం ఉందని అక్కడి వారి విశ్వాసం. అందుకే ఎప్పుడు ఆ జ్యోతిర్లింగం ఎంతో దివ్యంగా వేయి కాంతులు వెదజల్లుతూ వెలుగుతూ ఉంటుంది అని చెబుతున్నారు. అలా ఇక్కడి శివుని వాయు లింగమునకు ప్రాణం ఉందని భక్తుల విశ్వాసం. దేశంలో ఇంకెక్కడ ఇంత విచిత్రం లేదంటే అతిశయోక్తి కాదు.

మరింత సమాచారం తెలుసుకోండి: