కాబట్టి ఎలాగైనా లడ్డును పొందనిదే తిరుమల విడిచి వెళ్లేవారు కాదు. ఇటువంటి ఎంతో ప్రాముఖ్యత ఉన్న లడ్డుకి ఉన్న చరిత్ర గురించి ఎప్పుడైనా తెలుసుకోవాలని మీకు అనిపించిందా ? మరి లడ్డూ వెనుకున్న ఆ చరిత్ర ఎంతో ఒకసారి చూద్దాం. ఈ లడ్డూ నిన్నటితో 306 సంవత్సరాలు పూర్తి చేసుకుందని తెలుస్తోంది. కానీ ఈ విషయంలో చాలా మందికి కొన్ని సందేహాలున్నట్లు తెలుస్తోంది. మనకు తెలిసిన సమాచారాన్ని బట్టి ఈ లడ్డూను 1715 ఆగష్టు 2 వతేదీ నుండి ఇస్తున్నట్లుగా చెబుతున్నారు. ఈ లడ్డూ తయారీ కోసం వందల మంది భక్తులు పనిచేస్తారు. అయితే ఈ సమాచారంలో ఎంత మాత్రం నిజముందో మాత్రం ఎవ్వరికీ తెలియదు.
కానీ ప్రాచీన వివరాలను బట్టి చూస్తే, ఇంతకు ముందు అంటే క్రీ.శ. 1803 వ సంవత్సరంలో శ్రీవారి ప్రసాదంగా బూందీని ఇచ్చే వారట. ఆ తరువాత ఆ బూందీని 1940 సంవత్సరానికి లడ్డూగా మారినట్లు తెలుస్తోంది. దీనిని బట్టి శ్రీ వారి ప్రసాదమైన లడ్డూకి 306 సంవత్సరాలా ? లేదా 81 సంవత్సరాలా ? అన్నది ఇంకా స్పష్టత లేదు. ప్రారంభంలో లడ్డూ కేవలం ఎనిమిది అనలే ఉండేదట... కాలక్రమేణా అది 25 రూపాయల వరకు వెళ్ళింది. ఇలా ఇప్పటికీ లడ్డూ కి ఎన్ని సంవత్సరాలన్నది తెలియలేదు.