కొంతమంది హేతువాదులు 33 కోట్ల మంది దేవతలు.. ముక్కోటి మంది దేవతలు అని అంటారు కదా..! వీరంతా ఎక్కడున్నారు.. ఎక్కడి నుంచి వచ్చారు ..అని అంటున్నారు. నిజానికి మన హిందూ సంప్రదాయంలో గొప్ప విషయం ఏమిటంటే , హిందువులు ప్రతి ఒక్క విషయాన్ని దైవ స్వభావంతో భావిస్తారు. అలాగే ప్రతి పరమాణును కూడా దైవంగా భావిస్తారు కాబట్టి, హిందువుల ప్రకారం 33 కోట్ల మంది దేవతలు ఉన్నారు అని చెబుతారు. భక్తులు ఎలా ఉన్నారు అంటే పుట్ట కనిపించినా, చెట్టు కనిపించిన అలాగే గుట్ట కనిపించినా కూడా దైవంగా భావించి పూజిస్తూ ఉంటారు కాబట్టే ముక్కోటి దేవతలు ఉన్నారు అని భక్తులు నమ్ముతారు..
ఇక ఈ 33 మంది దేవతల అంశలు, అంశాంశలు ఇవన్నీ 33 కోట్ల దేవతలు అయ్యాయి. వర్ణనలో చెప్పుకోవడానికి ముప్పై మూడు కోట్ల దేవతలు అయినప్పటికీ, వేదం ప్రకారం ఉన్నది మాత్రం 33 మంది దేవతలు. అంతేకాదు హిందూ శాస్త్రం ప్రకారం ఉన్న పవిత్ర గ్రంథాలలో కూడా 33 కోట్ల మంది దేవతలు ఉన్నారని ఎక్కడా ప్రస్తావించలేదు. దేవుడు అంటే ఎవరు అంటే.. మనిషే దేవుడు అని చెప్పారు.. ఎందుకంటే దేవుడు అంశ మనిషిలో ఉంటుందట. అందుకే "మానవసేవయే మాధవసేవ" అన్నారు పెద్దలు.. మనిషికి సేవ చేసుకుంటే ఆ మాధవుడికి సేవ చేసుకున్నంత పుణ్యం, ప్రతిఫలం లభిస్తుంది అని మన పెద్దవాళ్ళు చెప్పారు. ఇక ఇదే హిందూ ధర్మం కూడా చెబుతోంది..